Gold price prediction: బంగారం ప్రియులకు శుభవార్త.. డబ్బులు రెడీ చేసుకోండి.. తులం గోల్డ్ రూ. 85,000 వచ్చేస్తోంది.. కారణాలు ఇవే..
Gold price prediction : ప్రస్తుతం గోల్డ్ రేటు భారీగా పెరుగుతున్నా.. మరికొద్ది రోజుల్లో భారీగా తగ్గబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Gold price prediction
Gold price prediction: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ దూసుకెళ్తున్నాయి. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ చైనా ఉత్పత్తులపై 100శాతం టారిఫ్ లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కారణంగా అమెరికా మార్కెట్లలో గందరగోళం నెలకొంది. దీంతో బంగారం రేటు ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ రేటు 4వేల డాలర్లు దాటుకొని దూసుకెళ్తోంది. భారత దేశంలో తులం గోల్డ్ రూ.లక్షన్నరకు చేరువులోకి దూసుకెళ్తోంది. అయితే, ప్రస్తుతం గోల్డ్ రేటు చూసి భయపడొద్దని.. త్వరలోనే బంగారం ధరలు భారీగా తగ్గబోతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
బంగారం, వెండి ధరలు కొద్దిరోజులుగా రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. తద్వారా ఆల్‌టైం రికార్డులను నమోదు చేస్తున్నాయి. దసరా పండుగ వేళ బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమైన ప్రజలకు గోల్డ్ రేట్లు షాకిచ్చాయి. మరికొద్ది రోజుల్లో రాబోయే దీపావళి పండుగకు బంగారం కొనుగోలు చేసేందుకు మహిళలు సిద్ధమవుతుండగా.. గోల్డ్ రేటు మాత్రం రోజురోజుకు పెరుగుతుండటంతో నిరాశ చెందుతున్నారు. అయితే, రాబోయే కాలంలో గోల్డ్ రేటు భారీగా తగ్గబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న బంగారం ధరల్లో 30 నుంచి 35శాతం ధరలు తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. 2007-08 మరియు 2011 సంవత్సరాల్లో ప్రధాన ర్యాలీల తరువాత బంగారం ధర 45శాతం పడిపోయిందన్న విషయాలను గుర్తు చేస్తున్నారు. కొద్దికాలంలోనే బంగారం 10గ్రాముల రేటు రూ. 85వేల లేదా రూ.77,701కు తగ్గే అవకాశం ఉందని, అదే సమయంలో వెండి కిలో రేటు రూ.77,450కు చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజాగా.. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇటీవల ఒక అధ్యయనంలో ఇన్వెస్టర్లను బంగారంలో పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన చేసింది. ప్రస్తుతం గోల్డ్ ఓవర్ బాట్ పొజిషన్లో (బంగారం ధరలు ఎక్కువగా పెరిగిపోవడం) ఉందని, కనుక భవిష్యత్తులో కచ్చితంగా ఒక కరెక్షన్ (ధర తగ్గడం) వచ్చే అవకాశం ఉందని, పూర్తిగా పెట్టుబడిదారులు బంగారం వైపు మాత్రమే కాకుండా డైవర్సిఫైడ్ (ఒకేచోట కాకుండా వివిధ మార్కెట్ రంగాల్లో పెట్టుబడి) చేయాలని సూచన చేసింది.
ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి నెలల్లో బంగారం రేటు భారీగా తగ్గే చాన్స్ ఉంటుందని నిపుణుల అంచనా వేస్తున్నారు. ఒకవేళ బంగారం తగ్గుదల బాట పట్టినట్లేతే కనీసం ముప్పై నుంచి నలబై శాతం మీద తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.