Gold Rate : ఓర్నాయనో.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా? వెండి రేటు అయితే..
Gold Rate : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర..
- Harishth Thanniru
- Published On : November 26, 2025 / 10:48 AM IST
Gold Rate
Gold Rate : బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. డిసెంబరులో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు అంచనాల బలంతో పసిడి ధరలు గ్లోబల్ మార్కెట్లలో భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. ఇవాళ కూడా పెరిగింది. మరోవైపు వెండి రేటు సైతం దూసుకెళ్తోంది.
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.870 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.800 పెరిగింది. గ్లోబల్ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 22 డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,164 డాలర్ల వద్ద కొనసాగుతుంది. మరోవైపు.. వెండి ధరలు సైతం భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం కిలో వెండిపై రూ.3వేలు పెరగ్గా.. ఇవాళ (బుధవారం) రూ.2వేలు పెరిగింది. దీంతో రెండు రోజుల్లోనే కిలో వెండిపై రూ.5వేలు పెరుగుదల చోటు చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,17,250 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,27,910కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,17,400కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,28,060కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,17,250 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,27,910 కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,76,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,69,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,76,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
