×
Ad

Gold Price Today : బంగారం ప్రియులకు భారీ శుభవార్త.. తగ్గిన ధర.. ఏపీ, తెలంగాణలో 10గ్రాముల గోల్డ్ రేటు ఎంతంటే?

Gold Price Today తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.

Gold Price Today

Gold Price Today : బంగారం కొనుగోలుదారులకు భారీ ఊరట లభించింది. కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న గోల్డ్ రేటు దూకుడుకు బ్రేక్ పడింది.

Also Read: Gold Price Prediction : వామ్మో.. తులం బంగారం ధర రూ.2లక్షలకు చేరుతుందా..? ఈ ఏడాది చివరిలో ధరలు ఎలా ఉండబోతున్నాయి.. నిపుణులు ఏం చెప్పారంటే..

మంగళవారం బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారట్ల బంగారంపై 2,620 పెరిగింది.. గడిచిన ఐదు రోజుల్లో 10గ్రాముల గోల్డ్ పై సుమారు రూ.5వేలు పెరిగింది. అయితే, ఇవాళ గోల్డ్ రేటు తగ్గింది.

బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 320 తగ్గింది. 22 క్యారట్ల బంగారంపై రూ.300 తగ్గింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై సుమారు 30 డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 3,767 డాలర్లకు చేరింది. మరికొద్ది రోజుల్లో ఔన్సు గోల్డ్ 4వేల డాలర్లకు చేరే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా.
ఇకపోతే.. వెండి ధర స్థిరంగా కొనసాగతుంది. సోమవారం కిలో వెండిపై రూ.3వేలు పెరగ్గా.. మంగళవారం రూ.2వేలు పెరిగింది. రెండు రోజుల్లోనే కిలో వెండిపై రూ.5వేలు పెరిగింది. అయితే, ఇవాళ (బుధవారం) వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,05,750 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,15,370కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,05,900 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,15,520కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,05,750 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,15,520కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,50,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,40,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,50,000కు చేరింది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.