Gold Rate Today
Gold Rate Today : పండుగ వేళ బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఒక్కోరోజు భారీగా పెరుగుతున్న గోల్డ్ రేటు.. మరుసటి రోజు అకస్మాత్తుగా తగ్గిపోతుంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో (Gold Price Today ) ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. తాజా వివరాలను పరిశీలిస్తే..
బుధ, గురువారాల్లో బంగారం ధర భారీగా తగ్గింది. రెండు రోజుల్లో 24క్యారట్ల 10గ్రాముల గోల్డ్ రేటు సుమారు రూ.1300 తగ్గింది. అయితే, ఇవాళ బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 440 పెరిగింది. 22 క్యారట్ల బంగారంపై రూ. 400 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై ఆరు డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ 3,745 వద్ద ట్రేడవుతోంది.
మరోవైపు.. వెండి ధర భారీగా పెరిగింది. రెండ్రోజులు స్థిరంగా కొనసాగుతూ వచ్చిన వెండి.. శుక్రవారం అమాంతం పెరిగింది. కిలో వెండిపై రూ. 3వేలు పెరిగింది. దీంతో వెండి రేటు లక్షన్నర దాటేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,05,300 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,14,880కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,05,450 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,15,030కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,05,300 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,14,880కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.3వేలు పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,53,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,43,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,53,000కు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
Also Read: Gold Price Prediction : వామ్మో.. తులం బంగారం ధర రూ.2లక్షలకు చేరుతుందా..? ఈ ఏడాది చివరిలో ధరలు ఎలా ఉండబోతున్నాయి.. నిపుణులు ఏం చెప్పారంటే..