×
Ad

Gold Rate Today : వామ్మో.. తగ్గినట్టే తగ్గి మళ్లీ భగ్గుమన్న బంగారం ధరలు, వెండి ఏకంగా రూ. 3 లక్షలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

Gold and Silver Rates Today, March 10 : బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ఈ మార్చిలో భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈరోజు బంగారం రూ. 700 పెరగగా వెండి ధర మాత్రం ఏకంగా రూ. 10వేలపైనే పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి.

1/11
Gold and Silver Rates Today, March 10: అయ్య బాబోయ్.. బంగారం షాకుల మీద షాకులిస్తోంది. బంగారం కొద్దిరోజులుగా తగ్గినట్టే తగ్గి మళ్లీ భగ్గుమంది. ఇక బంగారానికి తోడు వెండి కూడా ఒకేసారి రూ. 10వేలు పెరిగింది. నిన్నటివరకూ బంగారం తగ్గుతుంది కదా ఇక కొనేసుకోవచ్చులే అనుకున్నవారికి బిగ్ షాక్ అనే చెప్పాలి.
2/11
అందులోనూ పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలామంది బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఎప్పుడు బంగారం తగ్గుతుందా? కొందామని చూస్తుంటారు. ఇప్పుడు సడెన్ గా బంగారం జంప్ అయింది. అంతర్జాతీయంగా యుద్ధం సంక్షోభ సమయంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గుదల ఉంటాయి. బంగారం ధరలు తగ్గడం లేదా పెరగడం జరుగుతుంది.
3/11
కానీ, అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై యుద్ధం చేస్తున్నా బంగారం ధరలు భారీగా పతనమవుతూ వచ్చాయి. దీనికి డాలర్ బలపడటమే కారణమని నిపుణులు చెబుతున్నప్పటికీ ఈరోజున బంగారం ధరలు ఉన్నట్టుండి అమాంతం ఆకాశాన్నంటాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్‌ డేటా ప్రకారం పరిశీలిస్తే.. మార్చి 10న బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం..
4/11
దేశీయ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే? : ఢిల్లీలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం (99.9శాతం స్వచ్ఛత) గ్రాముకు రూ. 16,253, 22 క్యారెట్ల బంగారం (91.6శాతం స్వచ్ఛత) గ్రాముకు రూ. 14,900, 18 క్యారెట్ల బంగారం (75శాతం స్వచ్ఛత) గ్రాముకు రూ. 12,194 పెరిగింది.
5/11
ఢిల్లీలో 24 క్యారెట్లకు 10 గ్రాముల బంగారం ధర రూ. 700 పెరిగి రూ. 1,62,530 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాములకు బంగారం ధర రూ. 650 పెరిగి రూ.1,49,000గా ట్రేడ్ అవుతోంది.
6/11
ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.700 పెరిగింది. దాంతో తులం 10 గ్రాములకు బంగారం ధర రూ.1,61,680 నుంచి రూ.1,62,380కి పెరిగింది. అలాగే, 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు ధర రూ.650 పెరిగి రూ.1,48,200 నుంచి రూ.1,48,850కి పెరిగింది.
7/11
18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.530 పెరిగింది. దాంతో రూ.1,21,260 నుంచి రూ.1,21,790కి పెరిగింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,090పెరిగింది. దాంతో తులం 10 గ్రాములకు బంగారం ధర రూ.1,63,090 నుంచి రూ.1,64,180కి పెరిగింది. అలాగే, 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు ధర రూ.1000 పెరిగి రూ.1,49,500 నుంచి రూ.1,50,500కి పెరిగింది.
8/11
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలివే : ఈరోజు ఏపీ, తెలంగాణలోని హైదరాబాద్, విజయవాడలో విశాఖలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.700 పెరిగింది. తులం 10 గ్రాములకు బంగారం ధర రూ.1,61,680 నుంచి రూ.1,62,380కి పెరిగింది. అలాగే, 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు ధర రూ.650 పెరిగి రూ.1,48,200 నుంచి రూ.1,48,850కి పెరిగింది.
9/11
వెండి విషయానికి వస్తే.. కిలో వెండి ధర మాత్రం ఏకంగా రూ.10,000 పెరిగి రూ.2,90,000 నుంచి రూ.3,00,000 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో తులం వెండి ధర రూ.3వేలుగా ట్రేడ్ అవుతోంది.
10/11
మల్టీ కమాడిటీ ఎక్స్‌ఛేంజ్‌ (MCX)లో బంగారం ధరలు కూడా పెరిగాయి. గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 1.07 శాతంగా ఉండగా రూ.1,715 పెరిగి రూ.1,62,014 వద్ద కొనసాగుతోంది. వెండి మే ఫ్యూచర్స్ 3.38 శాతంగా ఉండగా రూ.9,040 పెరిగి రూ.2,76,200 వద్ద కొనసాగుతోంది.
11/11
అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ ధరలు ఊగిసలాడుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ ధర 5,162.44 డాలర్ల వద్ద ఉండగా, ఔన్స్ వెండి ధర 88.33 డాలర్ల వద్ద కొనసాగుతోంది.