Telugu » Business » Gold Price Today March 9 Check 24k 22k Gold Rates In Hyderabad Telangana And Andhra Pradesh Sh
Gold Rate Today : వారెవ్వా.. బంగారం మళ్లీ తగ్గిందోచ్.. ఒక్కసారిగా గోల్డ్ ఢమాల్.. ఏపీ, తెలంగాణలో ఈరోజు తులం ఎంతంటే?
Gold and Silver Rates Today, March 9: బంగారం ధరలు మళ్లీ దొగొచ్చాయి. బంగారం తగ్గగా వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold and Silver Rates Today, March 9: బంగారం ప్రియులకు పండగే పండగ.. బంగారం కొనాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. ఎందుకంటే.. బంగారం ధరలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పడం కష్టమే.
2/11
అందుకే ధర తక్కువగా ఉన్నప్పుడే కొని పెట్టేసుకోండి. ప్రస్తుతం ఇరాన్ యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఒడిదుడుకులకు కారణమవుతున్నాయి. బంగారం మార్కెట్లో ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి.
3/11
గత కొద్ది రోజులుగా బంగారం ధరలు క్షీణత కనిపిస్తోంది. పెట్టుబడిదారులు ఈ సమయంలో పెట్టుబడి పెట్టాలా? వద్దా అనే అయోమయంలో పడిపోయారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా దిగొచ్చాయి.
4/11
అమెరికా డాలర్ బలపడటం వల్ల బంగారం పతనమైనట్టు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా మార్కెట్ ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్లపై కూడా పడటంతో పసిడి ధరలు తగ్గినట్టు తెలుస్తోంది.
5/11
తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్న కొద్దిగా పెరిగినట్టు కనిపించినా ఈరోజు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. మార్చి 9, 2026న (సోమవారం) బంగారం ధరల ప్రకారం.. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 196 తగ్గింది. దాంతో 16,168 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 180 తగ్గింది. ఆపై రూ. 14,280 వద్ద కొనసాగుతోంది.
6/11
18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ. 147 తగ్గింది. దాంతో రూ. 12,126 వద్ద కొనసాగుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 19చ600 తగ్గి రూ. 16,16,800 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములకు రూ. 18వేలు తగ్గి, రూ. 14,82,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములకు రూ. 14,700 తగ్గి రూ. 12,12,600 వద్ద కొనసాగుతోంది.
7/11
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలివే : హైదరాబాద్ బంగారం ధరల విషయానికి వస్తే.. ఈరోజు బంగారం ధర 10 గ్రాములకు 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,960 తగ్గింది. ఆపై రూ.1,61,680 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,800 తగ్గి ఆపై రూ.1,48,200 వద్ద ట్రేడ్ అవుతోంది.
8/11
అలాగే, 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,470 తగ్గిన తర్వాత రూ.1,21,260గా ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే బంగారం ధరలు ట్రేడ్ అవుతున్నాయి.
9/11
వెండి ధరల విషయానికి వస్తే.. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 2,90,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాల్లో రూ. 2,80,000 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధరలు ఇలానే ట్రేడ్ అవుతున్నాయి.
10/11
ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలివే : చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,63,090 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,500 ధర వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,30,000గా ట్రేడ్ అవుతోంది.
11/11
రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.161,830కి తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,48, 350కి తగ్గింది. అలాగే, ముంబైలో 10 గ్రాములకు 24 క్యారెట్ల బంగారం ధర రూ.161,680గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,48, 200కి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ బంగారం ఔన్సుకు 5,095.81 డాలర్లుగా ఉంది.