×
Ad

Gold Price Today : ఏంది సామీ ఇది.. రాత్రికిరాత్రే ఎందుకిలా..? బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. నేటి ధరలు ఇవే..

Gold Price Today తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర

Gold Price Today

Gold Price Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా.. నూతన సంవత్సరం వేళ, సంక్రాంతి పండుగ సందర్భంగా బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే మహిళలకు బిగ్ షాకింగ్ న్యూస్.. కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నగోల్డ్, సిల్వర్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి.. రాత్రికి రాత్రే వీటి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 1,100 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. వెయ్యి పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఔన్సు గోల్డ్ పై 63 డాలర్లు పెరిగింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ 4,403 డాలర్ల వద్దకు చేరుకుంది.

వెండి ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే కిలో వెండి ధర రూ. 2లక్షలు దాటగా.. ప్రస్తుతం రూ. 2.50లక్షల వైపు దూసుకెళ్తోంది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై 5వేలు పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,24,000 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,35,280కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,24,050 కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,35,430కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,24,000 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,35,280కు చేరింది.

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,31,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,19,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,31,000 వద్దకు చేరింది.
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

Rohit Sharma : రోహిత్ శర్మ ఎమోషనల్ కామెంట్స్.. ఆ సమయంలో క్రికెట్‌ను పూర్తిగా వదిలేద్దామని అనుకున్నా..