Rohit Sharma : రోహిత్ శర్మ ఎమోషనల్ కామెంట్స్.. ఆ సమయంలో క్రికెట్‌ను పూర్తిగా వదిలేద్దామని అనుకున్నా..

Rohit Sharma : 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తరువాత తనకు ఎదురైన సంఘటనల గురించి టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ ప్రస్తావిస్తూ..

Rohit Sharma : రోహిత్ శర్మ ఎమోషనల్ కామెంట్స్.. ఆ సమయంలో క్రికెట్‌ను పూర్తిగా వదిలేద్దామని అనుకున్నా..

Rohit Sharma

Updated On : December 22, 2025 / 10:42 AM IST

Rohit Sharma : టీమిండియా స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్కడుంటే అక్కడ సందడి వాతావరణం ఉంటుంది. జట్టును ముందుండి నడిపించి ఎన్నో ప్రతిష్టాత్మక టోర్నీల్లో టీమిండియాను విజేతగా నిలిపిన ఘనత రోహిత్ శర్మది. తన జూనియర్ క్రికెటర్లను ఆటపట్టిస్తూ.. వారితో సరదాగా ఉంటూ.. క్లిష్ట సమయంలో వారికి అండగా నిలుస్తూ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపడంలో రోహిత్ ముందు వరుసలో ఉంటాడు. అయితే, తాజాగా.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యాడు. గతంలో ఎదురైన సంఘటనలు గుర్తు చేసుకుంటూ.. ఓ సమయంలో క్రికెట్ ను వదిలేద్దామని అనుకున్నానని చెప్పాడు.

Also Read : Smriti Mandhana : టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి ఇండియన్ బ్యాటర్‌గా రికార్డు!

మాస్టర్స్ యూనియన్ ఈవెంట్ లో రోహిత్ శర్మ మాట్లాడారు.. 2023 వన్దే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తరువాత గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇప్పుడు ఈ మాటలు చెప్పడం ఈజీగా అనిపించొచ్చు.. కానీ, ఆ సమయంలో చాలా కష్టంగా ఉందని రోహిత్ అన్నారు. ఆ ఓటమి తరువాత తాను క్రికెట్ ను వదిలేద్దామని అనిపించిందని రోహిత్ శర్మ చెప్పారు.

‘వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తరువాత క్షణాలు ఎలా ఉంటాయో సాధారణంగా ఎవరికీ అర్ధం కాదని రోహిత్ అన్నాడు. ఆ ఓటమి తరువాత అందరూ నిరాశకు గురయ్యాం. వ్యక్తిగతంగా అది నాకు చాలా కఠినమైన సమయం. 2022లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నేను ఈ వరల్డ్ కప్ కోసమే ఉన్నాను. ఏకంగా రెండేళ్లు నా మొత్తం శక్తిని అందులోనే పెట్టాను. ఫైనల్లో ఓటమి తరువాత మళ్లీ సాధారణ స్థితికి రావడానికి నాకు రెండు నెలలు పట్టింది’ అంటూ రోహిత్ చెప్పారు.


2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తరువాత ఒక దశలో నిజంగానే ఇక క్రికెట్ ఆడాలనిపించలేదు. ఆటకు గుడ్ బై చెబితే బాగుండు అనిపించింది. ఆ నిరాశ నుంచి బయటకు రావడానికి నాకు చాలా సమయం పట్టింది. అప్పట్లో అది నాకు కఠిన సమయం. 2024 టీ20 వరల్డ్ కప్ ముందుందని గుర్తు చేసుకొని మళ్లీ ఆటపై దృష్టిపెట్టా. చాలా ఆలోచన, ఆత్మ పరిశీలన తరువాత మళ్లీ ఉత్సాహం వచ్చిందని రోహిత్ అన్నారు.

రోహిత్ శర్మ టీ20, టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో గిల్ సారథ్యంలో రోహిత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం రోహిత్ వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ తరువాత అంతర్జాతీయ క్రికెట్‌కు రోహిత్ వీడ్కోలు పలికే అవకాశం ఉంది.