Gold Rate Today : ఆ ఒక్క కారణంతో దెబ్బకు పడిపోయిన గోల్డ్ రేటు.. తులంపై వేలల్లో తగ్గింది.. బంగారం ప్రియులు వెంటనే ప్లాన్ చేసుకోండి,
Gold Rate Today : గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.1,910 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ.1,750 తగ్గింది.
- Harishth Thanniru
- Published On : October 30, 2025 / 10:35 AM IST
Gold Rate Today
Gold Rate Today : బంగారం ప్రియులకు భారీ శుభవార్త. గోల్డ్ రేటు భారీగా తగ్గింది. తులంపై వేలల్లో తగ్గుదల చోటు చేసుకుంది. దాదాపు ఆరేళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping)లు ముఖాముఖి భేటీ అయ్యారు. దక్షిణ కొరియాలోని బూసాన్‌లో వీరి సమావేశం జరిగింది. కొద్దికాలంగా ఇరు దేశాల మధ్య టారిఫ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఇద్దరు దేశాధినేతలు భేటీకావడం.. వారి మధ్య సమావేశం సానుకూలంగా జరిగింది. ఈ సమావేశంలో నేపథ్యంలో బంగారం ధర భారీగా తగ్గింది.
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.1,910 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ.1,750 తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర తగ్గింది. ఔన్సు బంగారంపై 12డాలర్లు తగ్గగా.. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 3,974 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
వెండి ధరసైతం తగ్గింది. కిలో వెండిపై వెయ్యి తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,10,450 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,20,490కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,10,600 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,20,640కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,10,450కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,20,490కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర తగ్గింది.. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,65,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,50,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,65,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
