Gold Rates: ఫెడ్ దెబ్బకు బంగారం ధరల్లో భారీ మార్పులు.. ఇన్వెస్టర్లు కీలక నిర్ణయం.. ఏపీ, తెలంగాణలో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..
Gold Rates : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర..
- Harishth Thanniru
- Published On : November 30, 2025 / 07:48 AM IST
Gold Rates
Gold Rates: బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయంగా, భారతదేశంలోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయి. డిసెంబర్ 9, 10 తేదీల్లో అమెరికా కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ సమీక్షా సమావేశం నిర్వహించనుండటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఈసారి వడ్డీ రేట్లను కచ్చితంగా తగ్గించనున్నట్లే సంకేతాలు ఇచ్చింది. దీంతో డాలర్, బాండ్ ఈల్డ్స్ డిమాండ్ తగ్గిపోయి బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు బంగారం వైపు మళ్లడంతో ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. బంగారం రేటు రెండు రోజుల్లోనే సుమారు రూ.2వేలు పెరగ్గా.. వెండి రేటు వారం రోజుల్లో రూ. 21వేలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,19,000 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,29,820కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,19,150 కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,29,970కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,17,750 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,28,460కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,92,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,85,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,92,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
