Gold Rates Today : రెండ్రోజులు వరుసగా తగ్గిన గోల్డ్ రేటు.. ఇవాళ మళ్లీ జంప్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
- Harish Thanniru
- Updated on- September 19, 2025 / 11:03 AM IST
Gold Rates Today
Gold Rates Today : బంగారం కొనుగోలుకు సిద్ధమవుతున్నవారికి ధరలు మరోసారి షాకిచ్చాయి. గోల్డ్ రేటు మళ్లీ పెరిగింది. గడిచిన రెండు రోజుల్లో (బుధ, గురువారం) బంగారం ధర తగ్గింది. రెండు రోజుల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 760 తగ్గింది. అయితే, శుక్రవారం బంగారం రేటు మళ్లీ పెరిగింది.
ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 160పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.150 పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 12డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 3,657 డాలర్ల వద్ద కొనసాగుతుంది.
ఇవాళ వెండి ధరసైతం పెరిగింది. కిలో వెండిపై బుధవారం రూ.2వేలు, గురువారం రూ.వెయ్యి తగ్గగా.. ఇవాళ కిలో వెండిపై రూ.2వేలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,02,050 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,11,330కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,050 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,11,480కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,02,050 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,11,330కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,43,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,33,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,43,000కు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
