Gold And Silver Rates : బంగారం, వెండి కొనుగోలుదారులకు శుభవార్త.. భారీగా తగ్గుదల.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

Gold Silver Price Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్, సిల్వర్ ధరలు ఇవాళ భారీగా తగ్గాయి.

1/7
బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే మీకు శుభవార్త. ఎందుకంటే ఇవాళ గోల్డ్, సిల్వర్ ధరలు తగ్గాయి.
2/7
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఫరిణామాల నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ ధరలు తగ్గుముఖం పట్టాయి. రాబోయే వారం రోజులు గోల్డ్ రేటు తగ్గుతూ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
3/7
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.380 తగ్గింది.. 22 క్యారెట్ల బంగారంపై రూ.350 తగ్గింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్‌పై 10డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,612 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ.5వేలు తగ్గింది.
4/7
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,52,350 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,39,650 వద్ద కొనసాగుతోంది.
5/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,52,500కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,39,800 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,52,350కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,39,650 వద్ద కొనసాగుతుంది.
6/7
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,65,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,55,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,65,000వద్దకు చేరింది.
7/7
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.