Gold Silver Prices Today : పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బంగారం ధరలో ఊహించని తగ్గుదల.. రెండోరోజూ పతనం

Gold Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త.. గోల్డ్ రేటు మళ్లీ తగ్గింది.

Gold Rate Today

Gold Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త.. గోల్డ్ రేటు మళ్లీ తగ్గింది. బుధవారం తగ్గిన బంగారం రేటు.. ఇవాళ (గురువారం) కూడా భారీగా తగ్గింది.

Also Read : AP Govt : ఏపీలోని పేద వర్గాల ప్రజలకు శుభవార్త.. సర్కార్ కీలక నిర్ణయం.. తక్కువ ధరకే బియ్యం..

గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.2180 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 2వేలు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 13 డాలర్లు తగ్గగా.. ప్రస్తుతం అక్కడ ఔన్స గోల్డ్ 3,976 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,39,800 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,28,150 వద్ద కొనసాగుతోంది.

బుధ, గురువారాల్లో 24 క్యారెట్ల బంగారంపై సుమారు రూ.4వేలు తగ్గింది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గోల్డ్ రేటులో మార్పులు చేసుకుంటున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఆయా దేశాల మధ్య యుద్దవాతావరణం సర్దుమణుగుతుండటంతో గోల్డ్ రేటు క్రమంగా తగ్గుతుందని.. రానున్న రోజుల్లోనూ బంగారం రేటు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,39,950 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,28,350 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,39,800కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,28,150 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,00,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,00,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,00,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.