Gold-Silver Prices Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్ లో తులం ఎంతంటే?

అంతర్జాతీయ మార్కెట్‌ పరిణామాల ప్రభావంతో దేశీయంగా బంగారం ధరలు (Gold Silver Prices) మళ్లీ పెరుగుదల వైపు అడుగులు వేస్తున్నాయి.

Gold Silver Prices Today 17 September 2026 In Hyderabad Visakhapatnam Full Details

  • పెరిగిన బంగారం ధరలు
  • తులం రేటు ఎంతంటే
  • తెలుగు రాష్ట్రాల్లో వివరాలు

Gold-Silver Prices Today: అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రభావంతో దేశీయంగా బంగారం ధరలు మళ్లీ పెరుగుదల వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, గ్లోబల్ డిమాండ్‌లో వచ్చిన మార్పుల కారణంగా పసిడి విపణిలో స్వల్ప చలనాలు నమోదవుతున్నాయి. బంగారం ప్రియులకు, పెట్టుబడిదారులకు నిత్యం ఆసక్తి కలిగిచే ఈ ధరల హెచ్చుతగ్గులు, బులియన్ మార్కెట్‌లో నేడు స్వల్పంగా సానుకూల ధోరణిని కనబరిచాయి.

Read Also – Vijayasai Reddy: పదవుల కోసం మత మార్పిడి.. వైకాపాపై విజయసాయి రెడ్డి సంచలన పోస్ట్

దేశవ్యాప్తంగా పసిడి రేట్లు ఎంత పెరిగాయంటే?

నిన్నటితో పోల్చి చూస్తే ఈరోజు దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి(Gold Silver Prices Today)పై తులానికి (10 గ్రాములు) సుమారు రూ. 10 మేర స్వల్ప పెరుగుదల నమోదు కాగా, ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,53,450 వద్ద కొనసాగుతోంది. అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,40,660 వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు:

హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోనూ బంగారం ధరలు ఇవే సరళిలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల తులం (10 గ్రాములు) ఆభరణాల బంగారం ధర రూ. 1,40,660 గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల మేలిమి తులం బంగారం ధర రూ. 1,53,450 కి చేరింది. విజయవాడ, విశాఖపట్నం సహా రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లోనూ దాదాపుగా ఇవే ధరలు అమలవుతున్నాయి.