Gold Silver Prices Today : మహిళలకు బిగ్‌న్యూస్.. బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు.. నేటి ధరలు ఇవే..
Gold Silver Prices Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా.. అయితే, మీకు బిగ్‌న్యూస్. వీటి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
- Harish Thanniru
- Published on- October 24, 2026 / 10:35 AM IST
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్‌న్యూస్. గోల్డ్ ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత నాలుగు రోజుల్లో గోల్డ్ రేటు భారీగా తగ్గింది. అయితే, ఇవాళ స్వల్పంగా పెరిగింది. మరోవైపు వెండి రేటు భారీగా తగ్గింది.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ. 100 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 100 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు భారీగా తగ్గింది. ఔన్సు గోల్డ్‌పై 30డాలర్లకుపైగా తగ్గింది. దీంతో చాలాకాలం తరువాత ఔన్సు గోల్డ్ 4వేల డాలర్ల నుంచి దిగొచ్చింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 3,993 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. 5వేలు తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,42,580 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,30,700 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,42,730 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,30,850 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,42,580కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,30,700 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,20,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,20,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,20,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
