Gold Silver Price Drop Today : పసిడి ప్రియులకు పండగే.. కుప్పకూలిన బంగారం, వెండి రేట్లు.. ఏపీ, తెలంగాణలో తులం గోల్డ్ రేటు ఎంతంటే?
Gold Silver Price Drop Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. నేడు గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా తగ్గాయి.
- Harish Thanniru
- Updated on- June 19, 2026 / 10:46 AM IST
Gold and silver prices dropped Today
- బంగారం, వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్
- నేడు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- అంతర్జాతీయ మార్కెట్లో పడిపోయిన గోల్డ్ రేటు
Gold Silver Price Drop Today : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం తాత్కాలికంగా ముగిసింది. రెండు దేశాల మధ్య అవగాహ్నా ఒప్పందంపై (ఎంవోయూ) అధికార లాంఛనం పూర్తయింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ప్రస్తుతానికి ఎండ్ కార్డు పడింది. ఈ పరిణామంతో స్టాక్ మార్కెట్లలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. రెండు రోజుల్లో వేలల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గడంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Fuel Curbs Removal India : రైతులకు భారీ ఊరట.. సాగు ప్రారంభ సమయంలో కేంద్రం కీలక నిర్ణయం.. తగ్గనున్న ధరలు..!
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.3650 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై 3,350 తగ్గింది. దీంతో గడిచిన నాలుగు రోజుల్లో గోల్డ్ రేటు సుమారు రూ.6వేలకుపైగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సఉ గోల్డ్ పై దాదాపు 80 డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,135 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. వెండి ధరసైతం భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.15వేలు తగ్గింది. దీంతో గడిచిన నాలుగు రోజుల్లో కిలో వెండిపై రూ. 25వేలు తగ్గినట్లయింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,45,860 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,33,700 వద్దకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,46,010 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,33,850 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,48,040కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,35,700 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,55,000 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,50,000కు చేరగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,55,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
