Gold Silver Price Today : బంగారం కొనేవారికి షాక్.. వరుసగా రెండో రోజూ భారీ పెరుగుదల.. హైదరాబాద్‌లో ఎంతుందో తెలుసా?
పసిడి, వెండి ధరలు(Gold Silver Price Today) వరుసగా రెండో రోజు భారీగా పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
- V Santhosh Kumar
- Published on- July 3, 2026 / 11:32 AM IST
Gold silver rates today 3 july 2026 in hyderabad visakhapatnam full details
- భారీగా పెరిగిన బంగారం ధరలు
- ఆకాశాన్నంటిన వెండి సరికొత్త రికార్డు
- కొనుగోలుదారులకు తప్పని గట్టి షాక్
Gold Silver Price Today: పసిడి, వెండి ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా రెండో రోజు భారీగా పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్‌లో ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 3,220 పెరిగి రూ. 1,47,000 మార్కును తాకింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 2,950 పెరిగి రూ. 1,34,750 వద్ద విక్రయించబడుతోంది. 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ. 11,025 వద్ద కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Silver Price Today) రూ. 1,47,150 వద్ద, 22 క్యారెట్ల ధర రూ. 1,34,900 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశవ్యాప్తంగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
బంగారంతో పాటే వెండి కూడా భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ఏకంగా రూ. 2,60,000 కి చేరి రికార్డు సృష్టించింది. ఢిల్లీలో కేజీ వెండిపై రూ. 5,000 పెరిగి రూ. 2,50,000 వద్ద విక్రయాలు సాగుతున్నాయి. వరుసగా పెరుగుతున్న ఈ ధరలు పెళ్లిళ్ల సీజన్‌లో ఉన్న వారికి పెద్ద భారంగా మారాయి.
