Yamaha RayZR 125 Fi Hybrid
మీరు కొత్త స్కూటర్ కొనాలనుకుంటున్నారా? అయితే, జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం యమహా (Yamaha) మీకో గుడ్‌న్యూస్ చెబుతోంది. తన 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, కంపెనీ తన పాపులర్ స్కూటర్ Yamaha RayZR 125 Fi హైబ్రిడ్‌పై భారీ ఆఫర్లను ప్రకటించింది.
ఈ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా రూ.10,000 వరకు డిస్కౌంట్, పరిశ్రమలోనే మొదటిసారిగా 10 ఏళ్ల వారంటీ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ వివరాలు, RayZR స్కూటర్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆఫర్ హైలైట్స్
యమహా తన 70 ఏళ్ల ప్రయాణానికి గుర్తుగా కస్టమర్లకు ఈ బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది. Yamaha RayZR 125 Fi హైబ్రిడ్, స్ట్రీట్ ర్యాలీ మోడళ్ల ఆన్-రోడ్ ధరపై రూ.10,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్‌లోనే అతిపెద్ద హైలైట్ ఏంటంటే.. రెండేళ్ల స్టాండర్డ్ వారంటీతో పాటు, ఎనిమిదేళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీ (మొత్తం 10 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్లు) లభిస్తుంది. అంతేకాదు మీరు మీ స్కూటర్‌ను అమ్మినా, ఈ వారంటీ కొత్త యజమానికి బదిలీ అవుతుంది. ఇది మీ స్కూటర్‌కు మంచి రీసేల్ విలువను ఇస్తుంది.
గమనిక: ఇది పరిమిత కాలం పాటు అందుబాటులో ఉండే ఆఫర్ మాత్రమే.
Also Read: విదేశాల్లో దుమ్ము లేపుతోన్న బజాజ్.. వీటికి ఫుల్ డిమాండ్.. మన దగ్గర..
ఫీచర్లు
కేవలం ఆఫర్లే కాదు, ఈ స్కూటర్ ఫీచర్లలో కూడా టాప్. సిటీ రైడింగ్‌కు ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.
పవర్, మైలేజ్: ఇందులోని 125cc Fi బ్లూ కోర్ ఇంజిన్, స్మార్ట్ మోటార్ జనరేటర్ (SMG) హైబ్రిడ్ టెక్నాలజీతో వచ్చింది. దీనివల్ల సాధారణ స్కూటర్ల కంటే 16% ఎక్కువ మైలేజ్ లభిస్తుంది.
Y-Connect బ్లూటూత్: మీ స్మార్ట్‌ఫోన్‌ను స్కూటర్‌కు కనెక్ట్ చేసి కాల్ అలర్ట్స్, SMS నోటిఫికేషన్లు, పార్కింగ్ లొకేషన్ వంటివి తెలుసుకోవచ్చు.
ఫుల్లీ డిజిటల్ డిస్‌ప్లే: 4.2 అంగుళాల పెద్ద TFT స్క్రీన్ రైడింగ్ సమాచారాన్ని స్పష్టంగా చూపిస్తుంది.
LED లైటింగ్: స్టైలిష్ LED హెడ్‌ల్యాంప్, పొజిషన్ లైట్లు రాత్రిపూట ప్రయాణాన్ని సురక్షితం చేస్తాయి.
సేఫ్టీ ఫీచర్లు: యునిఫైడ్ బ్రేకింగ్ సిస్టమ్ (UBS), సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ వంటివి అదనపు భద్రతను అందిస్తాయి.
ధరలు, కలర్స్
డ్రమ్ వెర్షన్: రూ. 79,340 (ఎక్స్-షోరూమ్)
కలర్స్: సియాన్ బ్లూ, మెటాలిక్ బ్లాక్, మ్యాట్ రెడ్
డిస్క్ వెర్షన్: రూ. 86,430 (ఎక్స్-షోరూమ్)
కలర్స్: పై మూడు రంగులతో పాటు రేసింగ్ బ్లూ, డార్క్ మ్యాట్ బ్లూ
స్ట్రీట్ ర్యాలీ మోడల్: రూ. 92,970 (ఎక్స్-షోరూమ్)
కలర్స్: ఐస్ ఫ్లూ వర్మిలియన్, సైబర్ గ్రీన్, మ్యాట్ బ్లాక్
తక్కువ ధర, ఎక్కువ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు, 10 ఏళ్ల వారంటీ… ఒక స్కూటర్ కొనడానికి ఇంతకంటే మంచి డీల్ మరొకటి ఉండదు. మీరు కొత్త స్కూటర్ కోసం చూస్తుంటే, ఈ యమహా RayZR 125 Fi హైబ్రిడ్ ఆఫర్‌ను అస్సలు మిస్ చేసుకోవద్దు. వెంటనే మీ దగ్గరలోని యమహా షోరూమ్‌ను సంప్రదించండి.