Google Pixel 10 Offer : సూపర్ డిస్కౌంట్ బ్రో.. ఈ గూగుల్ పిక్సెల్ 10పై ఏకంగా రూ. 18,800 తగ్గింపు.. ఇలా కొన్నారంటే?

Google Pixel 10 Offer : గూగుల్ పిక్సెల్ 10 ఆఫర్ అదిరింది.. ఇలా కొన్నారంటే ఏకంగా రూ. 18,800 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలంటే?

Google Pixel 10 Offer

  • గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ రూ. 79,999 ప్రారంభ ధర లాంచ్
  • ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రూ. 64,115 ధరకు లభిస్తోంది
  • రూ. 15,884 నేరుగా ధర తగ్గింపు..
  • బ్యాంకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత ఆదా

Google Pixel 10 Offer : పిక్సెల్ అభిమానులకు అదిరిపోయే ఆఫర్.. మీరు గూగుల్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. అమెజాన్ గూగుల్ పిక్సెల్ 10పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. పిక్సెల్ 10 అసలు ధర రూ. 79,999 కాగా ఈ లేటెస్ట్ డీల్‌తో రూ. 18,800పైగా సేవింగ్ చేసుకోవచ్చు.

6.3-అంగుళాల డిస్‌ప్లే, 48MP మెయిన్ సెన్సార్, టెన్సర్ G5 చిప్‌సెట్ సహా మరెన్నో ఫీచర్లతో వస్తుంది. క్లీన్ ఆండ్రాయిడ్, కెమెరాల (Google Pixel 10 Offer) పరంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇలాంటి డీల్స్ లిమిటెడ్ టైమ్ మాత్రమే ఉంటాయి. పిక్సెల్ 10 ఫోన్ ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

గూగుల్ పిక్సెల్ 10 డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ రూ. 79,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రూ. 64,115కు లభిస్తోంది. రూ. 15,884 నేరుగా ధర తగ్గింపు పొందవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు HSBC క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 3వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా ధర తగ్గాలంటే మీ పాత స్మార్ట్‌ఫోన్‌‌తో కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.

Read Also : Samsung Galaxy A35 : వావ్.. ఆఫర్ అదిరింది.. ఈ శాంసంగ్ 5G ఫోన్ సగం ధరకే.. ఎందుకు కొనాలంటే?

పిక్సెల్ 10 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 10లో 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 6.3-అంగుళాల స్క్రీన్ ఉంది. అలాగే, ఈ ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 10లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48MP మెయిన్ సెన్సార్, 13MP అల్ట్రావైడ్ లెన్స్ 10.8MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‌లో ఫ్రంట్ సైడ్ 10.5MP కెమెరా కూడా ఉంది. పిక్సెల్ 10 లోపల, టెన్సర్ G5 చిప్‌సెట్‌ను అమర్చారు. 12GB వరకు ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. అంతేకాదు.. ఈ ఫోన్‌లో 4,970mAh బ్యాటరీతో పాటు 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.

పిక్సెల్ 10 ఎందుకు కొనాలి? :
గూగుల్ అందించే అద్భుతమైన ఫోన్లలో పిక్సెల్ 10 ఒకటి. ఈ ఫోన్‌లో టెన్సర్ G5 చిప్ రోజువారీ వాడకానికి అద్భుతంగా ఉంటుంది. అయితే, ఈ ఫోన్‌లో కొన్ని లోపాలు ఉన్నాయి. పోటీదారులతో పోలిస్తే ఛార్జింగ్ స్పీడ్ చాలా స్లో ఉంటుంది.

గేమింగ్ పర్ఫార్మెన్స్ ఫర్వాలేదు కానీ అంత బెస్ట్ కాదనే చెప్పాలి. ఎల్టీపీఓ డిస్‌ప్లే కూడా లేదు. అయినప్పటికీ స్మార్ట్ సాఫ్ట్‌వేర్ ఫీచర్లు, అదిరిపోయే కెమెరాలు, క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్ పీరియన్స్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి.