Airtel vs Jio : జియో, ఎయిర్టెల్ ఏది బెటర్? ప్లాన్ మాత్రం ఒక్కటే.. డేటా బెనిఫిట్స్ వేరు.. ఛాయిస్ మీదే!
Airtel vs Jio : జియో 449 ప్లాన్ కన్నా ఎయిర్టెల్ 449 ప్లాన్ ఎక్కువ డేటా అందిస్తుంది. మీ వద్ద జియో, ఎయిర్టెల్ సిమ్ కార్డులు ఉంటే.. రీఛార్జ్ చేసే ముందు ఏ ప్లాన్ ఎక్కువ బెనిఫిట్స్ అందిస్తుందో చూద్దాం..
Airtel vs Jio
- జియో కన్నా ఎయిర్ టెల్ ప్లాన్‌లోనే ఎక్కువ బెనిఫిట్స్
- రెండు ప్లాన్ల ధర రూ. 449 మాత్రమే.. కానీ, డేటా మాత్రం వేరు
- ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ యూజర్లకు అదనంగా 1GB డేటా
Airtel vs Jio : ఎయిర్ టెల్ యూజర్లకు అదిరిపోయే ప్లాన్.. రిలయన్స్ జియో కన్నా ఎక్కువ డేటా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సింపుల్ ఎయిర్ టెల్ ప్లాన్ ధర రూ. 449 మాత్రమే. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్లు రోజుకు 1GB ఎక్కువ డేటా పొందవచ్చు. బెనిఫిట్స్ చూస్తే జియో రూ. 449 ప్లాన్ ఎయిర్టెల్ రూ. 449 ప్లాన్ కన్నా బెటరా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
జియో 449 ప్లాన్ :
రిలయన్స్ జియో రూ. 449 రీఛార్జ్ ప్లాన్ ప్రీపెయిడ్ యూజర్లకు పండగే.. రోజుకు 3GB హై-స్పీడ్ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ (Airtel vs Jio) మెసేజ్ బెనిఫిట్స్ అందిస్తుంది. అదనపు బెనిఫిట్స్ విషయానికొస్తే.. రూ. 449 ప్లాన్ డేటా, కాలింగ్ ఎస్ఎంఎస్ బెనిఫిట్స్, 3 నెలల పాటు జియో హాట్‌స్టార్ మొబైల్‌కు యాక్సెస్ కూడా అందిస్తుంది.
అంతేకాదు.. ఈ ప్లాన్ 50GB జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ రూ. 35,100 విలువైన గూగుల్ జెమిని ప్రోతో 5000GB క్లౌడ్ స్టోరేజ్ అందిస్తుంది. జెమిని నానో బనానా యాక్సెస్ కూడా అందిస్తుంది. జియో అన్ లిమిటెడ్ 5G ప్లాన్ ద్వారా ఎఫ్ యూపీ లిమిట్ లేకుండా ఎంజాయ్ చేయొచ్చు.
Read Also : WhatsApp iPhones : వావ్.. వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్.. ఒక్కసారి చూడగానే మెసేజ్‌లు మాయం.. ఎలాగంటే?
ఎయిర్టెల్ 449 ప్లాన్ :
ఎయిర్టెల్ రూ. 449 ప్లాన్ డేటా పరంగా ఎక్కువ బెనిఫిట్ పొందొచ్చు. రోజుకు 4GB డేటాను పొందవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్ మెసేజ్, అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ 5G ప్లాన్‌లో గూగుల్ వన్ కింద 30GB క్లౌడ్ స్టోరేజ్, 28 రోజుల పాటు జియో హాట్‌స్టార్ మొబైల్, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే సబ్స్క్రిప్షన్, ఆపిల్ మ్యూజిక్, రూ. 4వేలు విలువైన అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం, ప్రతి 30 రోజులకు ఒకసారి ఫ్రీ హలోట్యూన్, ఇంకా స్పామ్ కాల్ ఎస్ఎంఎస్ బ్లాకింగ్ వంటి స్పెషల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
ఎయిర్టెల్ ప్లాన్ రోజుకు 4GB డేటా అందిస్తుంది. రోజుకు 1GB అదనపు డేటా పొందవచ్చు. ఈ రెండు ప్లాన్లలో అదనపు బెనిఫిట్స్ వేరుగా ఉంటాయి. మీకు ఏ ప్లాన్ బెస్ట్ అంటే మీరే డిసైడ్ చేసుకోండి.
