Google Pixel Watch 5 : కొత్త పిక్సెల్ వాచ్ చూశారా? జెమిని, హెల్త్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది.. ధర జస్ట్ ఎంతంటే?
Google Pixel Watch 5 Stephen : గూగుల్ పిక్సెల్ వాచ్ 5 స్టీఫెన్ కర్రీ స్పెషల్ ఎడిషన్ అదుర్స్.. ఈ కొత్త స్మార్ట్ వాచ్ సేల్ మొదలైంది. హెల్త్ ఫీచర్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. గూగుల్ స్టోర్, అమెజాన్ ద్వారా ఈ స్మార్ట్ వాచ్ కొనేసుకోవచ్చు.
- Sreehari A
- Published on- September 4, 2026 / 08:49 PM IST
Google Pixel Watch 5
- పిక్సెల్ వాచ్ 5 జెమిని, హెల్త్ ట్రాకింగ్‌కు సపోర్టు ఇస్తుంది
- 45mm మోడల్ 40 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది
- స్టీఫెన్ కర్రీ ఎడిషన్‌లో రై-పెర్ఫార్మెన్స్ లూప్ కూడా ఉంది
Google Pixel Watch 5 Stephen Curry Special Edition : పిక్సెల్ ఫ్యాన్స్‌కు పండగే.. స్టాండర్డ్ మోడల్స్ తర్వాత గూగుల్ పిక్సెల్ వాచ్ 5 స్టీఫెన్ కర్రీ స్పెషల్ ఎడిషన్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త స్మార్ట్‌వాచ్ రేంజ్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ ఎడిషన్ 45mm సైజులో వస్తుంది.
శాటిన్ పైరైట్ కేస్‌ను రై-పెర్ఫార్మెన్స్ లూప్‌తో అందిస్తుంది. ఈ బ్యాండ్‌కు వాటర్-రిపెల్లెంట్ ఫినిష్ కూడా ఉంది. అలాగే స్టీఫెన్ కర్రీ బ్రాండింగ్ ఉంటుంది. గూగుల్ ఈ ఏడాది ప్రారంభంలో స్టీఫెన్ కర్రీ థీమ్‌తో ఫిట్‌బిట్ ఎయిర్‌ను కూడా లాంచ్ చేసింది.
ధర, లభ్యత వివరాలివే :
స్టీఫెన్ కర్రీ స్పెషల్ ఎడిషన్ పిక్సెల్ వాచ్ 5 ధర 579.99 డాలర్లు (సుమారుగా రూ. 54,800). స్టాక్ ఉన్నంత వరకు గూగుల్ స్టోర్, అమెజాన్ యూఎస్ (Google Pixel Watch 5) ద్వారా కొనేసుకోవచ్చు. పెర్ఫార్మెన్స్ లూప్‌ను విడిగా కొనుగోలు చేస్తే ధర 59.99 డాలర్లు (సుమారుగా రూ. 5,700) చెల్లించాలి.
గత నెలలో గూగుల్ పిక్సెల్ వాచ్ 5ను 41mm 45mm సైజులలో లాంచ్ చేసింది. ఈ ధరలు వరుసగా 399 డాలర్లు (సుమారు రూ. 37,700) 429 డాలర్లు (సుమారు రూ. 40,500) నుంచి ప్రారంభమవుతాయి. LTE వేరియంట్ల ధరలు వరుసగా 499 డాలర్లు (సుమారు రూ. 47,100) 529 డాలర్లు (సుమారు రూ. 50,000)గా ఉన్నాయి.
పిక్సెల్ వాచ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
స్టీఫెన్ కర్రీ స్పెషల్ ఎడిషన్, పిక్సెల్ వాచ్ 5కు 45mm శాటిన్ పైరైట్ అల్యూమినియం కేస్ రై-కలర్ పెర్ఫార్మెన్స్ లూప్‌ను అందిస్తుంది. గూగుల్ ఈ ప్రత్యేకమైన స్ట్రాప్‌ను స్టాండర్డ్ పిక్సెల్ వాచ్ 5తో అందించదు.
ఈ బ్యాండ్ వాటర్-రిపెల్లెంట్ కోటింగ్‌తో పాటు స్టీఫెన్ కర్రీ బ్రాండింగ్ ఉంటుంది. యాక్చువా 360 అమోల్డ్ ఎల్టీపీఓ డిస్‌ప్లేతో వస్తుంది. 3,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. 60Hz వరకు రిఫ్రెష్ రేట్లకు సపోర్టు ఇస్తుంది. ఆల్వేస్-ఆన్ మోడ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ స్క్రీన్ కూడా ఉంది.
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ W5 జెన్ 2 యాక్సిలరేటెడ్ ప్లాట్‌ఫామ్, కార్టెక్స్-M55 కో-ప్రాసెసర్ పిక్సెల్ వాచ్ 5కు పవర్ అందిస్తాయి. పిక్సెల్ వాచ్ 4 కన్నా 20 శాతం హై పర్ఫార్మెన్స్‌తో పాటు 50 శాతం ఎక్కువ ర్యామ్, 12 శాతం సీపీయూ బూస్ట్‌ను అందిస్తుందని గూగుల్ పేర్కొంది. ఈ వాచ్‌లో 64GB eMMC స్టోరేజ్ కూడా ఉంది.
జెమిని ఏఐ, హెల్త్ ఫీచర్లు :
పిక్సెల్ వాచ్ 5లో జీమెయిల్ క్యాలెండర్ డేటాతో సహా జెమినికి సపోర్టు ఇస్తుంది. హెల్త్ ఫీచర్లలో AFib ఐడెంటిటీతో ECG, హార్ట్ రేట్ అలర్ట్, SpO2, శ్వాస రేటు, స్కిన్ టెంపరేచర్, స్ట్రెస్ ట్రాకింగ్ ఉన్నాయి. అలాగే నిద్రలో బ్రీత్ యానలైజర్, పర్సనలైజడ్ స్లీప్ స్కోర్‌ను కూడా అందిస్తుంది.
పిక్సెల్ వాచ్ 5లో హెల్త్ గార్డియన్, బ్లడ్ ప్రెజర్, స్లీప్ బ్లీతింగ్ క్వాలిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్, నెలవారీ సమ్మరీలను అందిస్తుంది. బ్రీతింగ్ ఎమర్జెన్సీ డిటెక్షన్, ఆక్సిజన్ సాచురేషన్‌లో తగ్గుదలను గుర్తించేందుకు ఏఐతో పాటు PPG, యాక్సిలరోమీటర్, బారోమీటర్ సెన్సార్లు ఉన్నాయి.
పిక్సెల్ వాచ్ 5 డివైజ్ 50కి పైగా యాక్టివిటీలను ట్రాక్ చేస్తుంది. ఇందులో డ్యూయల్-ఫ్రీక్వెన్సీ GPS, వీక్లీ కార్డియో టార్గెట్స్ వంటివి ఉన్నాయి. 45mm మోడల్ 40 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. అయితే, 15 నిమిషాల ఛార్జింగ్‌తో 15 గంటల వరకు రన్ అవుతుంది. IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉంది.
