Xiaomi Smart Band 11 : మహిళల హెల్త్‌కి స్మార్ట్ ట్రాకర్.. షావోమీ కొత్త బ్యాండ్ అదుర్స్, ఒక్క ఛార్జ్‌తో 21 రోజుల బ్యాటరీ!
Xiaomi Smart Band 11 : మహిళ ఆరోగ్యం కోసం షావోమీ నుంచి స్మార్ట్ బ్యాండ్ 11 డివైజ్ వచ్చేసింది. అద్భుతమైన డిస్ప్లేతో పాటు పవర్ ఫుల్ హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Xiaomi Smart Band 11
- 1.72-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్
- ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 21 రోజుల వరకు బ్యాటరీ లైఫ్
- షావోమీ స్మార్ట్ బ్యాండ్ 11 5 ఏటీఎం రేటింగ్‌తో వస్తుంది
Xiaomi Smart Band 11 : మహిళల కోసం అద్భుతమైన హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ బ్యాండ్ వచ్చేసింది. చైనా కంపెనీ షావోమీ సరికొత్త ఫిట్నెస్ ట్రాకర్ స్మార్ట్ బ్యాండ్ 11ను గ్లోబల్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. సన్నని డిజైన్ పవర్ ఫుల్ హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లను అందిస్తుంది.
ముఖ్యంగా, ఈ స్మార్ట్ బ్యాండ్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 21 రోజుల వరకు పనిచేస్తుంది. షావోమీ ఇందులో HRV మానిటరింగ్ ఏఐ ఆధారిత స్లీప్ సైక్లింగ్ ట్రాకింగ్ వంటి ప్రొఫెషనల్ ఫీచర్లు ఉన్నాయి. షావోమీ స్మార్ట్ బ్యాండ్ 11 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలివే..
షావోమీ స్మార్ట్ బ్యాండ్ 11 ధర ఎంతంటే? :
చైనాలో షావోమీ స్మార్ట్ బ్యాండ్ 11 ధర 289 యువాన్లు (సుమారు రూ. 4,065) ఉంటుంది. NFC వెర్షన్ ధర 339 యువాన్లు (సుమారు రూ. 4,768), సెరామిక్, మెటల్ ఎడిషన్ల ధర 399 యువాన్లు (సుమారు రూ. 5,612) ఉంటుంది.
ఈ స్మార్ట్ బ్యాండ్ షావోమీ ఛానెళ్లు మెయిన్ చైనీస్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనేసుకోవచ్చు. అయితే, భారత్ సహా ప్రపంచ మార్కెట్లలో ఈ స్మార్ట్ బ్యాండ్ లభ్యతపై కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
షావోమీ స్మార్ట్ బ్యాండ్ 11 మోడల్ 2,000 నిట్స్ టాప్ బ్రైట్ నెస్, 2mm సన్నని బెజెల్‌తో 1.72-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. కర్వ్ బాడీతో ఈ స్మార్ట్ బ్యాండ్ 9.99mm మందంతో 15.58 గ్రాముల బరువుతో వస్తుంది. 11 మెటల్ సిరామిక్‌తో సహా వివిధ రకాల స్ట్రాప్ ఆప్షన్లతో లభిస్తుంది.
హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లలో హార్ట్ రేట్, బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్, ఇతర వెల్నెస్ ఫీచర్లు కూడా ఉన్నాయి. షావోమీ, హెచ్ఆర్వీ మానిటరింగ్ ఏఐ ఆధారిత స్లీప్ సైక్లింగ్ ప్రొఫెషనల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వివిధ రకాల ఇండోర్ అవుట్డోర్ యాక్టివిటీస్ ఈజీగా కవర్ చేయొచ్చు. 150కి పైగా స్పోర్ట్స్ మోడ్లకు సపోర్టు ఇస్తుంది.
బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే.. :
ఈ బ్యాండ్ సింగిల్ ఛార్జ్‌పై 21 రోజుల వరకు రన్ అవుతుంది. కాంటాక్ట్‌లెస్ పేమెంట్లు, స్మార్ట్ యాక్సెస్ కార్డ్ వంటి ఫీచర్ల కోసం ఇందులో NFC సపోర్టు కూడా ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా షావోమీ HyperOS 4పై రన్ అవుతుంది.
ఈ స్మార్ట్ బ్యాండ్ ఆండ్రాయిడ్, iOS డివైజ్ రెండింటికీ సపోర్టు చేస్తుంది. ఇతర ఫీచర్లలో స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్లు, మ్యూజిక్ కంట్రోల్స్ వివిధ రకాల కస్టమైజబుల్ వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్ బ్యాండ్ 5ATM వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా అందిస్తుంది.
