OPPO A7 Pro Launch : గేమర్లకు పండగే.. 8000mAh బ్యాటరీతో కొత్త ఒప్పో A7 ప్రో వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ నోట్ చేస్కోండి!
OPPO A7 Pro Launch : ఒప్పో A7 ప్రో ఫోన్ 50MP మెయిన్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 8MP కెమెరాతో రావచ్చు. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ16K వంటి రేటింగ్ అందిస్తుంది. ఈ నెల 11నే ఒప్పో ప్రో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
OPPO A7 Pro
- ఈ ఫోన్లో 6.57 అంగుళాల FHD+ రిజల్యూషన్ డిస్ప్లే
- స్మూత్ స్క్రోలింగ్ గేమింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేటింగ్
- 8GB వరకు LPDDR4X ర్యామ్, 512GB వరకు UFS 2.2 స్టోరేజ్
OPPO A7 Pro Launch : ఒప్పో లవర్స్ గెట్ రెడీ.. అతి త్వరలో ఒప్పో A7 ప్రో వచ్చేస్తోంది. కంపెనీ లాంచ్ తేదీని ముందుగానే రివీల్ చేసింది. ఈ ఫోన్ వచ్చే వారం చైనా మార్కెట్లోకి రానుంది. భారీ 8000mAh బ్యాటరీ అడ్వాన్స్ ఆప్షన్. ఓఎల్ఈడీ ప్యానెల్ డిస్ప్లేతో పాటు స్మూత్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ ఫోన్లో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుందని అంచనా. ఒప్పో A7 ప్రో లాంచ్ ముందు ఇతర ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి..
ఒప్పో A7 ప్రో లాంచ్ తేదీ :
ఒప్పో A7 ప్రో సెప్టెంబర్ 11న లాంచ్ కానుంది. కంపెనీ లాంచ్ తేదీని కూడా వెల్లడించింది. ఈ ఫోన్ ఫీచర్లలో లాంగ్ బ్యాటరీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఫస్ట్ కూడా ఫోన్ ఇదే కానుంది. చైనాలో లాంచ్ సంబంధించి ముందుగానే ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
ధర, సేల్ ఆఫర్లు :
ఒప్పో A7 ప్రో ఫోన్ సెప్టెంబర్ 11న చైనాలో లాంచ్ కానుంది. ఈ మార్కెట్లో ఈ ఒప్పో ఫోన్ ధర 2వేల యువాన్లు (దాదాపు రూ. 28వేలు)గా ఉంటుందని అంచనా. రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ సేల్స్ సెప్టెంబర్ 11న ప్రారంభం కానుంది. అంతకన్నా ముందే ఫోన్ స్పెషిఫికేషన్లు లీక్ అయ్యాయి.
స్పెసిఫికేషన్లు లీక్ :
వివిధ సర్టిఫికేషన్లలో ఒప్పో A7 ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. PYE110 మోడల్ నంబర్ ఫోన్లో 6.57-అంగుళాల FHD+ రిజల్యూషన్ డిస్ప్లే ఉందని TENAA లిస్టింగ్ పేర్కొంది. అదేవిధంగా ఓఎల్ఈడీ ప్యానెల్‌తో వస్తుందని అంచనా. స్మూత్ స్క్రోలింగ్ గేమింగ్ కోసం ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుందని అంచనా. 1.07 బిలియన్ కలర్ ఆప్షన్లకు కూడా సపోర్ట్ చేస్తుందని అంచనా.
ఫోన్ ప్రాసెసర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 చిప్ ఉంటుందని అంచనా. ప్రాసెసర్ కూడా ఆక్టా-కోర్ ఉంటుందని అంచనా. ఈ చిప్‌ను 8GB వరకు LPDDR4X ర్యామ్, 512GB వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో రావొచ్చు. మెమరీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్లో ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ కూడా ఉంటుందని అంచనా.
కెమెరా విషయానికి వస్తే.. :
ఒప్పో A7 ప్రోలో 50MP మెయిన్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ ఫ్రంట్ సైడ్ 8MP కెమెరాతో రావచ్చు. కెమెరా మాడ్యూల్ అడ్డంగా ఉండొచ్చు. ఎల్ఈడీ ఫ్లాష్ ఉండవచ్చు. ఒప్పో A7 ప్రోలో 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో భారీ 8000mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ బరువు సుమారు 206 గ్రాములు, మందం 8.8mm ఉంటుందని అంచనా. అలాగే, డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69K రేటింగ్‌తో వస్తుంది.
