Infinix HOT 70 Pro : ఫోన్ వెనుక డిస్ప్లే అదుర్స్.. ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రోలో ఈ ఫీచర్ చూస్తే వెంటనే కొనేస్తారు!
Infinix HOT 70 Pro : భారత మార్కెట్లో ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో ఫోన్ వచ్చేసింది. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీతో పాటు అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. ఈ ఫోన్ ధర, ఫీచర్ల పూర్తి వివరాలివే..
Infinix HOT 70 Pro
- 6.76-అంగుళాల పంచ్-హోల్ డిస్ప్లేతో వస్తుంది
- 50MP ప్రైమరీ కెమెరా, 6,000mAh బ్యాటరీ
- 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్
Infinix HOT 70 Pro : కొత్త ఫోన్ కొంటున్నారా? ఇన్ఫినిక్స్ నుంచి అద్భుతమైన ఫోన్.. ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5జీ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ బ్యాక్ సైడ్ యాక్టివ్ మ్యాట్రిక్స్ క్యూబ్ ఎలిమెంట్‌తో వస్తుంది. ఇంటరాక్టివ్ ఫీచర్లతో పాటు నోటిఫికేషన్లను కూడా డిస్ ప్లే చేస్తుంది.
అంతేకాదు.. మీడియాటెక్ డైమెన్సిటీ 7100 5G చిప్సెట్తో రన్ అవుతుంది. ఇందులో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ ఉంది. ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం..
ధర ఎంతంటే? :
ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5G 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999 గా ఉంది. ఈ ఫోన్ 8GB+128GB స్టోరేజ్ వేరియంట్లో కూడా లభిస్తుంది. అయితే, ఈ ప్రారంభ ధరలో బ్యాంక్ ఆఫర్లు కూడా పొందవచ్చు.
కంపెనీ 9 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్ల ద్వారా ఈ ఫోన్ కొనేసుకోవచ్చు. సిల్క్ గ్లో పర్పుల్, డైవ్ బ్లూ, థర్మో ఆరెంజ్, మిరాజ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఈ 5జీ ఫోన్ ఫుల్ HD+ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 91.86 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 910 నిట్స్ వరకు HBM బ్రైట్‌నెస్‌తో 6.76-అంగుళాల పంచ్-హోల్ డిస్ప్లే ఉంది. ఈ డిస్ప్లేలో ఐ ప్రొటెక్షన్, మోషన్ సిక్నెస్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ మాలి-G57 జీపీయూతో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 5G చిప్సెట్తో రన్ అవుతుంది.
90fps వరకు గేమింగ్‌కు సపోర్టు ఇస్తుందని ఇన్ఫినిక్స్ పేర్కొంది. ఈ ఫోన్లో UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16పై రన్ అవుతుంది. కంపెనీ 3 మెయిన్ OS అప్గ్రేడ్లు, 5 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్లతో వస్తుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే..
ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది. ఈ కెమెరా 2x లాస్‌లెస్ జూమ్, ఏఐ లైవ్ ఫోటో, ఏఐ ఎరేజర్, ఏఐ ఎక్స్టెండర్, వన్-ట్యాప్ వ్లాగ్ మోడ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో బ్యాక్ సైడ్ యాక్టివ్ మ్యాట్రిక్స్ క్యూబ్ (AMC) కూడా ఉంది.
ఇన్కమింగ్ కాల్స్, మెసేజ్‌లు, ఛార్జింగ్, లో బ్యాటరీ, కెమెరా, వీడియో, కౌంట్‌డౌన్, వెదర్ అలర్ట్స్ కోసం విజువల్ ఎఫెక్ట్‌లను డిస్ప్లే చేస్తుంది. ఈ ఫీచర్ స్టార్టప్, మ్యూజిక్ ప్లేబ్యాక్, గేమింగ్ సమయంలో యాంబియంట్ లైటింగ్ ఎఫెక్ట్‌లను కూడా డిస్ప్లే చేస్తుంది.
ఈ ఫోన్ 6,000mAh బ్యాటరీతో వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సుమారు 25 నిమిషాల్లో 50 శాతం, సుమారు 63 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది.
