D2M TV on Phone : ఇంటర్నెట్, డేటాతో పనిలేదు.. మీ ఫోన్‌లోనే లైవ్ టీవీ చూడొచ్చు.. త్వరలో D2M సేవలు?
D2M TV on Phone : ఇంటర్నెట్, మొబైల్ డేటాతో అవసరం లేకుండానే కేవలం నెట్ వర్క్ సిగ్నల్ ఆధారంగానే మీ ఫోన్లలో లైవ్ టీవీ ఛానళ్లను చూడొచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం D2M అనే కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది.
- Sreehari A
- Published on- September 30, 2026 / 06:57 PM IST
Govt prepares for D2M rollout
- D2M రోల్‌అవుట్‌కు ప్రభుత్వం సన్నాహాలు
- డేటా ఖర్చు లేకుండా మొబైల్‌లో టీవీ, న్యూస్, అలర్ట్స్
- సిగ్నల్ ఉన్నా డేటా లేకపోయినా టీవీ చూడొచ్చు
- D2Mతో కొత్త బ్రాడ్‌కాస్టింగ్ విప్లవం
D2M TV on Phone : ఇంటర్నెట్ అవసరం లేదు.. మొబైల్ డేటా అంతకన్నా అక్కర్లేదు.. మీ మొబైల్‌లో సిగ్నల్ ఉంటే చాలు.. లైవ్ టీవీ ఛానల్స్ చూసేయొచ్చు.. అలాగే ఆడియో కంటెంట్‌ను కూడా పొందొచ్చు. డైరెక్ట్-టు-మొబైల్ (D2M) అనే కొత్త టెక్నాలజీని కమర్షియల్ లెవల్‌లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ప్రభుత్వ ప్రసార సంస్థ ప్రసార భారతి వచ్చే నెలలో D2M సేవల కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (RFP) జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మొబైల్ డేటాతో పనిలేకుండా ఈజీగా లైవ్ టీవీ, న్యూస్ అలర్ట్స్ చూడొచ్చు అనమాట.
అన్ని ఒకేచోట చూడొచ్చు :
డీ2ఎమ్ టెక్నాలజీ సెల్యులార్ నెట్‌వర్క్‌కు బదులుగా బ్రాడ్‌కాస్ట్ సిగ్నల్స్ ద్వారా కంటెంట్‌ను నేరుగా సపోర్టు చేసే మొబైల్ ఫోన్లకు అందజేస్తుంది. దీంతో వినియోగదారులు మొబైల్ డేటాను వాడకుండానే లైవ్ టీవీ, వార్తలు, క్రీడలు, ఆడియో కంటెంట్‌తో పాటు ఎమర్జెన్సీ అలర్ట్స్ పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఈ టెక్నాలజీ అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నారు.
Read Also : KTR RRR Telangana : తెలంగాణలో RRR సీన్.. కేటీఆర్ సంచలన కామెంట్స్!
19కిపైగా నగరాల్లో ట్రయల్స్ :
ఎక్స్చేంజ్4మీడియా రిపోర్టు ప్రకారం.. తేజస్ నెట్‌వర్క్స్ అభివృద్ధి చేసిన డివైజ్‌లతో నిర్వహించిన టెక్నాలజీ వాలిడేషన్ పరీక్షలు ప్రభుత్వ సమీక్షలో ఉత్తీర్ణత సాధించిన అనంతరం డీD2ఎమ్ ప్లానింగ్‌లో స్పీడ్ పెరిగినట్లు తెలుస్తోంది. ప్రసార భారతి, ఐఐటీ కాన్పూర్, సాంఖ్య ల్యాబ్స్ కలిసి 19కుపైగా నగరాల్లో D2M ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి.
అయితే, దేశవ్యాప్తంగా అమలుకు హార్డ్‌వేర్, ప్రసార మౌలిక సదుపాయాలు ప్రధాన సవాళ్లుగా మారాయి. ప్రస్తుతం చాలా స్మార్ట్‌ఫోన్లు D2Mకు అవసరమైన రిసీవర్ హార్డ్‌వేర్‌కు సపోర్టు ఇవ్వవు. అలాగే, భారీ స్థాయి ప్రసారానికి మరింత టవర్ నెట్‌వర్క్ అవసరం కావచ్చు.
మొబైల్ తప్ప అసలు టీవీ అందుబాటులో లేని కుటుంబాలకు ఈ D2M సర్వీసు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలోని సుమారు 28 కోట్ల కుటుంబాల్లో దాదాపు 9 కోట్ల కుటుంబాలకు టీవీ సేవలు అందుబాటులో లేవని అధికారిక అంచనాలు సూచిస్తున్నాయి.
