New temperature Limit
New temperature Limit : కొత్త ఏసీ కొనేందుకు చూస్తున్నారా? ఇది మీకోసమే.. ఉక్కపోతగా ఉందని మీ ఏసీ టెంపరేచర్ ఎక్కువ పెట్టేస్తామంటే కుదరదు.. సాధారణంగా ఏసీ (New temperature Limit) టెంపరేచర్ 18-20 డిగ్రీలకు సెట్ చేస్తుంటారు.. ఇకపై అలా కుదరదు. అతి త్వరలో ఏసీలపై కొత్త టెంపరేచర్ లిమిట్ అమల్లోకి రానుంది.
ఏసీల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను తీసుకువస్తోంది. ఎయిర్ కండిషనర్ల టెంపరేచర్ కనిష్టంగా 20°C నుంచి గరిష్టంగా 28°C మధ్య పరిమితం చేయాలని నిర్ణయించింది. కొత్త ఏసీలన్నీ 20 డిగ్రీల సెంటిగ్రేడ్ కనిష్ట ఉష్ణోగ్రత, గరిష్టంగా 28 డిగ్రీల ఉష్ణోగ్రతతో మార్కెట్లోకి రానున్నాయి.
ఇలా సెట్ చేయడం ద్వారా విద్యుత్ ఆదా అవుతుందని కేంద్రం భావిస్తోంది. భారత్‌లో ఏసీకి కనిష్టంగా గరిష్ట టెంపరేచర్ సెట్ చేసినట్టు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు.
ఇప్పుడు ఏసీ టెంపరేచర్ 20°C కన్నా తగ్గదు :
ప్రస్తుతం మార్కెట్లో ఏసీల కనిష్ట టెంపరేచర్ పరిమితి 16 లేదా 18 డిగ్రీలు, గరిష్ట పరిమితి 30 డిగ్రీలుగా ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం.. ఎయిర్ కండిషనర్ 20°C కన్నా తక్కువగా 28°C మధ్య డిఫాల్ట్ సెటప్ ఉంటుంది.
తద్వారా విద్యుత్తును ఆదా చేయడమే కాకుండా పర్యావరణానికి కూడా భారీ ప్రయోజనం కలుగుతుందని కేంద్రం విశ్వసిస్తోంది. ఈ కొత్త ఏసీ టెంపరేచర్ నిబంధన ద్వారా వినియోగదారులకు 3 ఏళ్లలో రూ.18వేల నుంచి రూ.20వేల కోట్ల వరకు డబ్బు ఆదా అవుతుందని మనోహర్ లాల్ పేర్కొన్నారు.
సమ్మర్‌లో విద్యుత్ వినియోగం తగ్గి బిల్లు కూడా తగ్గుతాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇళ్లు, ఆఫీసులు, మాల్స్, హోటల్స్, సినిమా థియేటర్లలో అన్ని ఏసీలకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని ఆయన తెలిపారు. ఏసీలలో డిఫాల్ట్ టెంపరేచర్ సెటప్ నిబంధనలను ఇప్పటికే జపాన్, ఇటలీ దేశాలు అమలు చేస్తున్నాయి.
రోమ్ నగరంలో కనిష్టంగా ఏసీ టెంపరేచర్ 23 డిగ్రీలుగా నిర్ణయించారు. జపాన్‌లో 27 డిగ్రీలుగా సెట్ చేశారు. ఇప్పుడు భారత్ కూడా అదే బాటలో ఏసీ టెంపరేచర్ లిమిట్ నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది.