Haier AI Tower AC : కొత్త ఏసీ కొంటున్నారా? AI టవర్ AC వచ్చేసింది.. 10 సెకన్లలో మీ ఇల్లంతా కూల్.. కూల్!

Haier AI Tower AC : హైయర్ కొత్త స్పార్టన్ ఏఐ టవర్ ఏసీని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. 10 సెకన్లలో చల్లని గాలిని అందిస్తుంది. ఏఐ ఆధారిత ఫీచర్లు, సెల్ఫ్-క్లీనింగ్ టెక్నాలజీతో, ప్రీమియం యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. ధర ఎంతంటే?

Haier AI Tower AC

  • భారత మార్కెట్లోకి హైయర్ కొత్త స్పార్టన్ ఏఐ టవర్ ఏసీ
  • ఈ ప్రీమియం ఏఐ టవర్ ఏసీ కేవలం 10 సెకన్లలో కూలింగ్
  • ఏఐ టవర్ ఏసీ ప్రారంభ ధర రూ. 99వేలు మాత్రమే

Haier AI Tower AC : ఎండలు దంచికొడుతున్నాయి. దేశంలో వేడిగాలులు తీవ్రమవుతున్నాయి. మీరు కొత్త ఏసీ కొనేందుకు చూస్తుంటే.. మీకోసం మార్కెట్లోకి సరికొత్త ఏసీ వచ్చేసింది.
హైయర్ కొత్త ప్రీమియం స్పార్టన్ ఏఐ టవర్ ఎయిర్ కండిషనర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఎయిర్ కండిషనర్ కేవలం 10 సెకన్లలోనే మీ ఇంటిని కూలింగ్ చేస్తుంది.

ఈ సంస్థ ఏఐ-అట్మాక్స్, స్మార్ట్ ప్రీ-కూలింగ్, సెల్ఫ్-క్లీనింగ్ వంటి అనేక అడ్వాన్స్ టెక్నాలజీతో రూపొందింది. ఆకర్షణీయమైన డిజైన్, స్మార్ట్ ఫీచర్లతో పాటు పవర్‌ఫుల్ కూలింగ్ కోరుకునే యూజర్ల కోసం ఈ కొత్త టవర్ ఎయిర్ కండిషనర్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. ఇదేలా పనిచేస్తుందంటే?

ధర ఎంతంటే? :
ఈ ఏసీ టవర్ ప్రారంభ ధర రూ. 99,000గా కంపెనీ నిర్ణయించింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు రెండింటిలోనూ అమ్మకానికి అందుబాటులో ఉంది. వినియోగదారులు 20 శాతం వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, నెలకు రూ. 1,994 నుంచి ఈజీ ఈఎంఐలతో కూడా కొనేసుకోవచ్చు.

Read Also : Bank Holidays May 2026 : మేలో బ్యాంకులో పని ఉందా? 12 రోజులు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి.. బ్యాంక్ హాలిడేస్ ఫుల్ లిస్ట్..!

10 సెకన్లలో ఫాస్ట్ కూలింగ్ :
హైయర్ స్పార్టన్ ఏఐ టవర్ ఏసీలో అతిపెద్ద స్పెషాలిటీ సూపర్‌సోనిక్ కూలింగ్ టెక్నాలజీ. సాధారణ ఏసీల కన్నా 20 రెట్లు వేగంగా కేవలం 10 సెకన్లలోనే కూలింగ్ అందిస్తుంది. మండుటెండలో ఈ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది. టవర్ డిజైన్, పెర్ల్ వైట్, లగ్జరీ గోల్డ్ ఫినిషింగ్‌తో లభిస్తుంది. ఈ ఏసీ కేవలం కూలింగ్ ఇచ్చే డివైజ్ మాత్రమే కాదు.. ప్రత్యేకంగా మోడ్రాన్ ఇళ్ల కోసం రూపొందించినట్టు కంపెనీ తెలిపింది.

ఏఐ ఆట్మోక్స్‌తో స్మార్ట్ కూలింగ్ :
హైయర్ ఈ ఏసీలో ఏఐ క్లైమేట్ కంట్రోల్ 2.0ను అమర్చింది. మీ కూలింగ్ అలవాట్లు, గది ఉష్ణోగ్రత, బయటి వాతావరణం, రియల్ టైమ్ అనుగుణంగా కూలింగ్ సెట్టింగ్‌ అడ్జెస్ట్ చేస్తుంది. ఇందులో ఏఐ ప్రీ-కూలింగ్ ఫీచర్ స్పెషల్.

మీరు 100 మీటర్ల రేంజ్ రాగానే ఏసీ ఆటోమేటిక్‌గా ఆన్ అయి రూమ్ కూలింగ్ అవుతుంది. మీరు ఇంటికి రాగానే ఇన్‌స్టంట్ కూలింగ్ అందిస్తుంది. టైమర్లు లేదా మాన్యువల్ సెట్టింగ్‌ అవసరం లేదు. ఈ టెక్నాలజీ పవర్ ఆదా చేయడమే కాదు.. యూజర్ ఎక్స్ పీరియన్స్ కూడా అందిస్తుంది.

సెల్ఫ్ క్లినింగ్, ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ :
హైయర్ స్పార్టన్ ఏఐ టవర్ ఏసీలో ఏఐ ఐడీయూ ఫ్రాస్ట్ సెల్ఫ్ క్లీన్, ఏఐ ఓడీయూ సైక్లోన్ క్లీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇండోర్ యూనిట్ అవసరమైనప్పుడు సెల్ఫ్ క్లీనింగ్ అవుతుంది. దుమ్ము, ధూళి, సూక్ష్మ కణాలను తొలగిస్తుంది. అవుట్‌డోర్ యూనిట్ కూడా ప్రతి షట్‌డౌన్ తర్వాత ప్రతి 15 సెకన్లకు రివర్స్ ఎయిర్‌ఫ్లోతో సెల్ఫ్ క్లీన్ అవుతుంది. ఫాస్ట్ కూలింగ్‌ను అందించి పవర్ వినియోగాన్ని కూడా తగ్గుతుంది.