Haier HQLED P7 Pro : జెమిని AIతో కొత్త హైయర్ స్మార్ట్‌టీవీలు వచ్చేశాయ్.. అద్భుతమైన ఫీచర్లు, ధర జస్ట్ ఎంతో తెలుసా?

Haier HQLED P7 Pro : హైయర్ భారత మార్కెట్లో హైయర్ HQLED P7 ప్రో సిరీస్‌ను విడుదల చేసింది. ఈ టీవీలు 43-అంగుళాలు, 50-అంగుళాలు, 55-అంగుళాలు, 65-అంగుళాలు 75-అంగుళాల HQLED డిస్‌ప్లేలలో లభిస్తాయి.

Haier HQLED P7 Pro

  • 43, 50, 55, 65, 75-అంగుళాల డిస్‌ప్లేలో లభిస్తుంది
  • జెమిని ఇంటిగ్రేషన్, ప్రో సిరీస్ పవర్‌ఫుల్ ఏఐ ఫీచర్లతో వస్తుంది
  • 2GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ సెటప్

Haier HQLED P7 Pro : కొత్త స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్నారా? హైయర్ కంపెనీ భారత మార్కెట్లో హైయర్ HQLED P7 ప్రో సిరీస్‌ లాంచ్ చేసింది. ఈ టీవీలు 43-అంగుళాలు, 50-అంగుళాలు, 55-అంగుళాలు, 65-అంగుళాలు, 75-అంగుళాల HQLED డిస్‌ప్లేలలో లభిస్తాయి.

ఈ టీవీలలో 2GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. జెమిని ఇంటిగ్రేషన్‌తో గూగుల్ టీవీ అందిస్తోంది. హైయర్ HQLED P7 ప్రో సిరీస్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు (Haier HQLED P7 Pro) సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

ధర ఎంతంటే? :
హైయర్ HQLED P7 ప్రో సిరీస్ 43-అంగుళాల మోడల్ ధర రూ. 35,990, 50-అంగుళాల మోడల్ ధర రూ. 43,490, 55-అంగుళాల మోడల్ ధర రూ. 49,990, 65-అంగుళాల మోడల్ ధర రూ. 67,990, 75-అంగుళాల మోడల్ ధర రూ. 90,990గా ఉంది. ఈ టీవీ లైనప్ భారత మార్కెట్‌లోని అన్ని రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది.

స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
హైయర్ HQLED P7 ప్రో సిరీస్ టీవీ 93శాతం డీసీఐ-పీ3 కలర్ గామట్‌తో 43-అంగుళాలు, 50-అంగుళాలు, 55-అంగుళాలు, 65-అంగుళాలు 75-అంగుళాల HQLED డిస్‌ప్లేలతో వస్తుంది. ఈ డిస్‌ప్లేలు HDR, డాల్బీ విజన్‌కు సపోర్ట్ చేస్తాయి. 50 అంగుళాల కన్నా భారీ మోడల్స్ HDR10 ప్లస్ సపోర్ట్ చేస్తాయి.

Read Also : Vivo Y6e 5G : 6,500mAh బ్యాటరీతో కొత్త వివో Y6e 5G వచ్చేసింది.. ఫీచర్ల అదుర్స్, ధర కూడా తక్కువే!

ఆడియో సిస్టమ్‌లో ఇంటిగ్రేటెడ్ సబ్‌వూఫర్‌తో 50W 2.1-ఛానల్ స్పీకర్ సిస్టమ్ ఉంటుంది. ఈ టీవీలు డాల్బీ అట్మాస్, టోటల్ సోనిక్స్ ఆడియో టెక్నాలజీలకు సపోర్ట్ చేస్తాయి. ఈ టీవీలలో జెమిని ఇంటిగ్రేషన్‌తో గూగుల్ టీవీ, హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్‌కు కూడా సపోర్ట్ చేస్తాయి.

ఈ టీవీలో 2GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో Wi-Fi, బ్లూటూత్ 5.1, హీక్యాస్ట్ స్క్రీన్ మిర్రరింగ్, బ్లూటూత్ స్పీకర్ మోడ్ ఉన్నాయి. ఈ టీవీ సన్నని బెజెల్ యూనిబాడీ డిజైన్‌తో వస్తుంది.

కంటిపరంగా TÜV రైన్‌ల్యాండ్ సర్టిఫైడ్ లో బ్లూ లైట్‌ అందిస్తుంది. కంపెనీ 3 ఏళ్ల వారంటీని అందిస్తుంది. ఏఐ ఫీచర్లలో ఏఐ HDR ఎన్‌హాన్సర్, ఏఐ కలర్ బూస్ట్, ఏఐ మోషన్, ఏఐ నాయిస్ రిడక్షన్ ఉన్నాయి. గేమింగ్ ఫీచర్లలో 120Hz (DLG), MEMC, VRR, ALLM, గేమింగ్ బార్ ఉన్నాయి.