PPF Investment : పీపీఎఫ్ ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 5 తేదీలోగా PPF అకౌంట్లో పెట్టుబడి పెట్టండి.. లేదంటే భారీగా నష్టపోతారు..!

PPF Investment : పీపీఎఫ్ పెట్టుబడిదారులకు ఏప్రిల్ 5వ తేదీ చాలా కీలకం. ఈ తేదీకి ముందు పెట్టుబడి పెడితే పూర్తి నెల వడ్డీ వస్తుంది. ఆ తేదీ తర్వాత పెట్టుబడి పెడితే భారీ మొత్తంలో నష్టపోతారు జాగ్రత్త.. ఎలాగంటే?

PPF Investment

  • ఏప్రిల్ 5వ తేదీకి ముందు పెట్టుబడులపై పూర్తి నెల వడ్డీ
  • పెట్టుబడిని ఆలస్యం చేస్తే 15 ఏళ్లలో లక్షల నష్టం తప్పదు
  • పీపీఎఫ్ ఏడాదికి 7.10శాతం చొప్పున పన్ను రహిత వడ్డీ

PPF Investment : మీరు PPFలో పెట్టుబడి పెడుతున్నారా? కొత్త పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. ఇప్పుడే అర్జెంట్‌గా పీపీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయండి. లేదంటే భారీగా నష్టపోతారు. ఏప్రిల్ 5వ తేదీ (PPF డెడ్ లైన్). ఈ గడువు తేదీ దాటితే మీరు ఆ నెల వడ్డీని భారీ కోల్పోవాల్సి వస్తుంది.

PPFపై ఎంత వడ్డీ వస్తుంది? :
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది లాంగ్ టైమ్ సేవింగ్స్ పథకాల్లో ఒకటి. ఇందులో పెట్టుబడి పెడితే సురక్షితమైన రాబడి పొందవచ్చు. పన్ను మినహాయింపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం, ఏప్రిల్-జూన్ 2026 త్రైమాసికానికి 7.10శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ పూర్తిగా పన్ను రహితంగానే ఉంటుంది.

పీపీఎఫ్ ఏంటి?
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) సురక్షితమైన దీర్ఘకాలిక పొదుపు పథకం. రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఎక్కువగా ఇందులో పెట్టుబడి పెడుతుంటారు. ప్రస్తుత (ఏప్రిల్-జూన్ 2026) వడ్డీ రేటు సంవత్సరానికి 7.10గా ఉంది. పూర్తిగా పన్ను రహిత రిటర్న్‌లను పొందవచ్చు.

Read Also : WhatsApp Profile : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇక మీ ప్రొఫైల్ ఫొటో లేకుండా DP సెట్ చేసుకోవచ్చు తెలుసా? ఎలాగంటే?

డెడ్ లైన్ దాటితే జరిగేది ఇదే :
పీపీఎఫ్ వడ్డీని ప్రతి నెలా 5వ తేదీ (ఏప్రిల్ 5వ తేదీ లోపు పీపీఎఫ్‌లో పెట్టుబడి పెడితే) లెక్కిస్తారు. ఆ నెల చివరి రోజు మధ్య ఉన్న అత్యల్ప నిల్వపై లెక్కిస్తారు. మీరు ఏప్రిల్ 5వ తేదీ లోపు డబ్బు డిపాజిట్ చేస్తే.. మీ మొత్తం డబ్బుపై ఏప్రిల్ 5వ తేదీ నుంచి వడ్డీ వస్తుంది. మీరు 5 తర్వాత పెట్టుబడి పెడితే ఆ నెలకు మీకు వడ్డీ అందదు. లెక్కింపు తర్వాతి నెల నుంచి మొదలువుతుంది.

రూ. 1.5 లక్షలు పెట్టుబడిపై రాబడి ఎంతంటే? :
మీరు చేసే చిన్న ఆలస్యం కూడా లాంగ్ టైమ్ భారీ నష్టానికి దారితీస్తుంది. ఉదాహరణకు.. మీరు ప్రతి ఏడాదిలో రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెడతారనుకుందాం.. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 5వ తేదీ మధ్య పెట్టుబడి పెడితే మీ మొత్తం రూ. 22.5 లక్షల పెట్టుబడి 15 ఏళ్లలో సుమారుగా రూ. 40.68 లక్షలు కావచ్చు. ఇందులో సుమారుగా రూ. 18.18 లక్షల వడ్డీ కూడా ఉంటుంది.

5వ తేదీ తర్వాత నష్టం ఎంతంటే? :
మీరు ప్రతి ఏడాది పెట్టుబడి పెట్టడాన్ని ఆలస్యం చేస్తే.. అదే మొత్తం సుమారుగా రూ. 37.80 లక్షలకు మాత్రమే అవుతుంది. దీనిపై సుమారుగా రూ. 15.31 లక్షల వడ్డీ వస్తుంది. అంటే.. కేవలం మీరు చేసే చిన్న పొరపాటు కారణంగా సుమారుగా రూ. 2.9 లక్షల నష్టం వాటిల్లుతుంది. కేవలం పీపీఎఫ్‌లో పెట్టుబడి మాత్రమే సరిపోదు.

సరైన సమయంలో పెట్టుబడి పెట్టడం కూడా చాలా ముఖ్యం. మీరు ప్రతి ఏడాదిలో ఏప్రిల్ 5వ తేదీ లోపు పెట్టుబడి పెడితే భారీ మొత్తంలో రాబడిని పొందవచ్చు.