×
Ad

Hero Xtreme 125R : కొత్త బైక్ భలే ఉంది భయ్యా.. హీరో ఎక్స్‌ట్రీమ్ 125R బైక్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర జస్ట్ ఎంతంటే?

Hero Xtreme 125R : క్రూయిజ్ కంట్రోల్, రైడింగ్ మోడ్‌లతో గ్లామర్ X మాదిరిగా హీరో అదే ఫీచర్లతో రూ. 1.04 లక్షలకు ఎక్స్‌ట్రీమ్ 125R లాంచ్ చేసింది. ఫీచర్లు, ధర వివరాలివే..

Hero Xtreme 125R

Hero Xtreme 125R : కొత్త బైక్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి కొత్త హీరో బైక్ వచ్చేసింది. దేశంలో అతిపెద్ద టూవీలర్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ పాపులర్ మోటార్ సైకిల్ ఎక్స్‌ట్రీమ్ 125R కొత్త వేరియంట్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 1.04 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఈ కొత్త బైక్ అనేక కొత్త ఫీచర్లు, కలర్ ఆప్షన్లు కలిగి ఉంది.

అయితే, ఇంజిన్ కూడా అదే మాదిరిగా (Hero Xtreme 125R) ఉంది. కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 125R స్పోర్టీ డిజైన్‌ అలాగే ఉంచింది. కానీ, కంపెనీ 3 కొత్త పెయింట్ స్కీమ్‌లను ప్రవేశపెట్టింది. అందులో బ్లాక్ పెర్ల్ రెడ్, బ్లాక్ మ్యాట్ షాడో గ్రే, బ్లాక్ లీఫ్ గ్రీన్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ కలర్ ఆప్షన్‌లతో పాటు కొత్త గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. బైక్ మరింత స్టైలిష్‌గా, ప్రీమియంగా కనిపిస్తుంది.

రైడ్-బై-వైర్ టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి రానుంది. హీరో ఈ కొత్త వేరియంట్‌కు రైడ్-బై-వైర్ థ్రోటిల్ సిస్టమ్‌ను చేర్చింది. ఇందులో రైడర్‌లకు ఇప్పుడు పవర్, రోడ్, ఎకో అనే 3 రైడింగ్ మోడ్‌ ఆప్షన్ కూడా ఉంటుంది. కలర్ LCD స్క్రీన్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. గ్లామర్ ఎక్స్ బైకులో కూడా ఇదే ఫీచర్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా, డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ కలిగిన క్లాసులో ఫస్ట్ బైక్ ఇదే. సేఫ్టీ, కంట్రోలింగ్ రెండింటినీ అందిస్తుంది.

Read Also : Best Budget Cars : కొంటే ఇలాంటి కార్లు కొనాలి.. రూ. 10 లక్షల్లో టాప్ 5 లగ్జరీ లుక్ బడ్జెట్ కార్లు.. స్టైల్, మైలేజీ కోసమైన కొనేసుకోవచ్చు!

ఇంజిన్, పర్ఫార్మెన్స్ :
హీరో ఎక్స్‌ట్రీమ్ 125R అదే 124.7cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 11.5hp, 10.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. కంపెనీ ఈ బైక్‌ను స్పోర్టీ కమ్యూటర్ సెగ్మెంట్ కోసం రూపొందించింది. రోజువారీ వినియోగానికి స్పోర్టీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

ఏ బైక్‌లతో పోటీ అంటే ?:
హీరో కొత్త ఎక్స్‌ట్రీమ్ 125R ఇప్పుడు టీవీఎస్ రైడర్, హోండా CB125 హార్నెట్, బజాజ్ పల్సర్ N125 బైకులతో నేరుగా పోటీపడనుంది. అయితే, రూ.1.04 లక్షల ధర వద్ద సెగ్మెంట్‌లో అత్యంత ప్రీమియం, హై-టెక్ బైక్‌గా మారింది. టీవీఎస్ రైడర్ టాప్ వేరియంట్ కన్నా రూ.9వేలు ఖరీదైనది. అయితే, రైడర్ బైక్‌లో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ లేదా రైడ్-బై-వైర్ టెక్నాలజీ లేదని గమనించాలి.