Home Loan Interest Rates : కొత్త ఇల్లు కొంటున్నారా? ఈ నెలలో తక్కువ వడ్డీకే హోం లోన్ ఇస్తున్న టాప్ 5 బ్యాంకులు.. పూర్తి వివరాలు!

Home Loan Interest Rates : కొత్త ఇల్లు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీకో గుడ్ న్యూస్.. తక్కువ వడ్డీకే హోం లోన్లు అందించే టాప్ 5 బ్యాంకుల పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Home Loan Interest Rates

  • తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్న టాప్ 5 బ్యాంకులు
  • ఏయే బ్యాంకుల్లో ఎంత వడ్డీ రేట్లు ఉన్నాయో తెలుసా?
  • కొత్త ఇల్లు కావాలా? హోం లోన్లు ఎందులో తక్కువంటే?

Home Loan Interest Rates : సొంతంటి కోసం చూస్తున్నారా? చాలామంది కొత్త ఇల్లు కొనేందుకు ఎక్కువగా హోం లోన్లపైనే ఆధారపడుతుంటారు. ప్రస్తుతం పెరుగుతున్న ఆస్తి ధరల కారణంగా సొంత ఇంటిని కొనుగోలు చేయడం కష్టంగా మారుతోంది.

దాంతో బ్యాంకుల్లో హోం లోన్లు ఎక్కువగా తీసుకుంటారు. మీరు కూడా భవిష్యత్తులో బ్యాంకు నుంచి హోం లోన్ తీసుకోవాలని (Home Loan Interest Rates) ప్లాన్ చేస్తుంటే.. ముందుగా దేశంలోని వివిధ బ్యాంకుల గృహ రుణ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి.

తక్కువ వడ్డీ రేట్లు అందించే బ్యాంకు నుంచి హోం లోన్ తీసుకోవాలంటే ఇది మీకోసమే.. హోం లోన్లు ఎక్కువగా దీర్ఘకాలిక రుణాలే ఉంటాయి. అందుకే వడ్డీ రేట్లలో చిన్న తేడా ఉన్నా లాంగ్ టైమ్ భారీ మొత్తంలో ఆదా అవుతుంది. మీరు కూడా హోం లోన్ తీసుకునేందుకు ప్లాన్ చేస్తుంటే.. ప్రస్తుతం దేశంలో ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో హోం లోన్లు అందించే టాప్ 5 బ్యాంకులేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా :
ఈ బ్యాంకు తమ కస్టమర్ల కోసం 7.15 శాతం నుంచి తక్కువ వడ్డీ రేటుతో హోం లోన్లను అందిస్తోంది. మీ రుణ మొత్తం, ఆదాయం, ఇతర అర్హతల ఆధారంగా బ్యాంకు వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. గుడ్ క్రెడిట్ స్కోర్, తక్కువ వడ్డీ రేటుతో హోం లోన్ తీసుకోవచ్చు.

Read Also : ITR-1 vs ITR-2 : ఒకటికి మించి ఇళ్లు ఉన్నాయా? ITR-1 లేదా ITR-2 ఏది ఎంచుకోవాలి? పూర్తి రూల్స్, ఫైలింగ్ ప్రాసెస్

బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) :
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) తమ కస్టమర్లకు 7.20 శాతం నుంచి వడ్డీ రేటుతో హోం లోన్లను అందిస్తోంది. మీరు ఈ బ్యాంకు నుంచి హోం లోన్ తక్కువ వడ్డీకే తీసుకోవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) :
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్లకు 7.25 శాతం నుంచి వడ్డీ రేట్లతో హోం లోన్లను అందిస్తుంది. అర్హతను బట్టి ఈ వడ్డీ రేట్లు మారవచ్చు.

ఐసీఐసీఐ బ్యాంక్ :
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ తమ కస్టమర్ల కోసం తక్కువ వడ్డీ రేట్లకు హోం లోన్లను అందిస్తోంది. ఈ బ్యాంకు 7.45 శాతం నుంచి గృహ రుణాలను అందిస్తుంది. ఈ వడ్డీ రేట్లు వ్యక్తిగత అర్హతను బట్టి మారతాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ :
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ కస్టమర్లకు 7.75 శాతం నుంచి గృహ రుణాలను అందిస్తోంది. మీ అర్హతను బట్టి ఈ వడ్డీ రేట్లు మారవచ్చు.