EPF Home Loan : మీ హోం లోన్ రీపేమెంట్ చేయాలా? EPF నుంచి ఎంత విత్‌డ్రా చేయొచ్చు? ఈ రూల్స్ తప్పక తెలుసుకోండి!

EPF Home Loan : మీ EPFతో మీ గృహ రుణాన్ని ముందుగానే తిరిగి కట్టేయొచ్చు. కానీ, కొన్ని అర్హతలు, రూల్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు పూర్తి వివరాలతో తెలుసుకుందాం..

EPF Home Loan

  • హోం లోన్ రీపేమెంట్ కోసం ఈపీఎఫ్ డబ్బులు వాడొచ్చా?
  • ఈపీఎఫ్ నుంచి ఎంత మొత్తంలో ఫండ్స్ తీసుకోవచ్చు?
  • అసలు రూల్స్ ఏంటి? ఈపీఎఫ్ రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

EPF Home Loan : హోం లోన్ రీపేమెంట్ చేయాలని చూస్తున్నారా? మీరు EPF ఫండ్స్ ద్వారా హోం లోన్ ముందుగానే చెల్లించవచ్చు. అయితే, దీనికి చాలా రూల్స్ ఉన్నాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ ఫండ్ కూడబెట్టడమే.. కానీ, గృహ రుణాన్ని తిరిగి చెల్లింపు సహా ఇతర ఆర్థిక అవసరాల కూడా వాడుకోవచ్చు.

అయితే, ఈపీఎఫ్ నుంచి పూర్తి మొత్తంలో డబ్బులను విత్ డ్రా చేసుకోలేరు. ఈపీఎఫ్ నుంచి పాక్షిక విత్ డ్రా ఆప్షన్ అందుబాటులో ఉంది. పీఎఫ్ డబ్బులను హోం లోన్ తిరిగి చెల్లించే విషయంలో ఎలాంటి రూల్స్ పాటించాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..

హోం లోన్ కోసం EPF నుంచి డబ్బు విత్‌డ్రా అర్హతలివే :
ఉద్యోగి హోం లోన్ తిరిగి చెల్లించేందుకు ఈపీఎఫ్ ఖాతా నుంచి ఫండ్స్ విత్ డ్రా చేయాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరి. అందులో ఫస్ట్ పీఎఫ్ ఖాతా సభ్యుడు కనీసం 3 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. హోం లోన్ తిరిగి చెల్లించడానికి వాడే ఆస్తి తప్పనిసరిగా ఈపీఎఫ్ సభ్యుని పేరు మీద ఉండాలి.

అది జీవిత భాగస్వామి పేరు మీద లేదా జాయింట్‌గా కూడా ఉండవచ్చు. ఈ రకమైన విత్ డ్రా సాధారణంగా ఒక్కసారి మాత్రమే ఉంటుంది. అందుకే ఈపీఎఫ్ నుంచి ఫండ్స్ విత్ డ్రా చేసే ముందు మీ అవసరాలతో పాటు భవిష్యత్ ఆర్థిక పరిస్థితిని కూడా అంచనా వేయాలి.

Read Also : SBI FD Interest Rates : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. SBIలో 211 రోజుల FDపై ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?

హోం లోన్ కోసం EPF నుంచి డబ్బు విత్‌డ్రా? :
గృహ రుణ బ్యాలెన్స్‌ను తిరిగి పొందడానికి ఈపీఎఫ్ సభ్యుడు తమ EPF ఖాతాలో జమ చేసిన మొత్తం సొమ్ములో 90 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇల్లు సభ్యుని పేరు మీద లేదా వారి జీవిత భాగస్వామితో కలిసి జాయింట్ రిజిస్టర్ అయిన సందర్భాలలో ఇది వర్తిస్తుంది. అయితే, మొత్తం డిపాజిట్‌ విత్‌డ్రా చేయడాన్ని తొందరపాటుతో తీసుకోకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో రిటైర్మెంట్ సమయంలో ఈపీఎఫ్ డిపాజిట్ మీ అవసరాలను తీరుస్తుంది.

ఆన్‌లైన్‌లో EPF క్లెయిమ్ ఎలా చేయాలి? :
పీఎఫ్ ఖాతాదారుల UAN వివరాలు, KYC రికార్డులు సరిగ్గా ఉండాలి. EPF విత్ డ్రా చాలా ఈజీగా ఉంటుంది. ఆన్‌లైన్‌లో కూడా సింపుల్ అప్లయ్ చేసుకోవచ్చు.

  • ఫస్ట్ UAN ద్వారా EPFO ​​ఆన్‌లైన్ సర్వీసులో లాగిన్ అవ్వండి.
  • ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా వివరాలు ఈపీఎఫ్ ఖాతాతో లింక్ చేయండి
  • ఇప్పుడు ఆన్‌లైన్ సర్వీసెస్‌కు వెళ్లి క్లెయిమ్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • విత్ డ్రా రీజన్ ఆప్షన్ ఎంచుకుని అవసరమైన మొత్తాన్ని ఎంటర్ చేయండి.
  • బ్యాంకు ఖాతా వివరాలతో అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించండి.
  • అన్ని వివరాలను చెక్ చేసుకున్నాక క్లెయిమ్‌ను సబ్మిట్ చేయండి.