Telugu » Business » How To Check The Purity Of Gold Jewellery Using The Governments Bis App Step By Step Easy Guide Sh
Gold Jewellery Purity : మీ బంగారు ఆభరణాల స్వచ్ఛతను BIS యాప్‌తో ఎలా చెక్ చేయాలో తెలుసా? స్టెప్ బై స్టెప్ గైడ్ ప్రాసెస్..!
Gold Jewellery Purity : బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు హాల్‌మార్క్‌ను చెక్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆభరణాలలో స్వచ్ఛమైన బంగారం లేదా నకిలీ బంగారం ఉండొచ్చు. BIS యాప్ ద్వారా ఈజీగా చెక్ చేయొచ్చు.
Gold Jewellery Purity : బంగారం కొంటున్నారా? మీరు కొనే బంగారు ఆభరణాలు నిజమైనవేనా? సాధారణంగా భారత మార్కెట్లో విక్రయించే అన్ని బంగారు ఆభరణాలకు 6 అంకెల హాల్‌మార్క్ (HUID) యూనిక్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) అనేది బంగారు ఆభరణాలకు హాల్ మార్క్‌లను అందించే ఒక ప్రభుత్వ సంస్థ. అయితే, బంగారు ఆభరణాలపై ఉన్న హాల్‌మార్క్.. నిజమైన హాల్ మార్క్ లేదా అనేది వినియోగదారులు ఈజీగా తెలుసుకోవచ్చు.
ప్రస్తుతం (BIS) ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ యాప్ (BIS Care) అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్స్ సాయంతో మీ బంగారంపై ఉన్న HUID నంబర్ అసలైనదో కాదో తెలుసుకోవచ్చు. ఈ హాల్ మార్క్ నెంబర్ యాప్‌లో ఎంటర్ చేయాలి. ఆపై యాప్ వెంటనే స్కాన్ చేసి అది ఒరిజినల్ లేదా ఫేక్ అనేది క్షణాల వ్యవధిలోనే చెప్పేస్తుంది.
ఆభరణాలపై హాల్‌మార్క్ ఎందుకంటే? :
బంగారు ఆభరణాలు చాలా ఖరీదైనవి. అందుకే స్వచ్ఛమైన బంగారు ఆభరణాలను కొనాలి. అందుకే ప్రభుత్వం గత రెండు ఏళ్ల క్రితమే బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసింది. బంగారం, వెండిని హాల్‌మార్కింగ్ పరిధిలోకి తీసుకొచ్చారు. హాల్‌మార్క్‌లు బంగారం స్వచ్ఛతను తెలియజేసే అధికారిక సింబల్స్. హాల్‌మార్కింగ్ స్కీమ్ అనేది బంగారం కల్తీ కాకుండా చూడొచ్చు.
BIS యాప్ బంగారం స్వచ్ఛతను చెకింగ్ ఎలా? :
ఆభరణంపై ఉన్న హాల్‌మార్క్‌ను గుర్తించండి.
హాల్‌మార్క్‌లో వాడిన బంగారం అధికారిక నిష్పత్తి ఉంటుంది.
హాల్‌మార్కింగ్ చెకింగ్ కోసం గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి BIS CARE అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
మీ పేరు, ఫోన్ నంబర్, ఇమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
ప్లే స్టోర్: https://play.google.com/store/apps/details id=com.bis.bisapp&hl=en_IN
BIS యాప్‌ను ఎలా ఉపయోగించాలంటే? :
BIS యాప్ డౌన్‌లోడ్ తర్వాత ఓపెన్ చేసి “Verify HUD” ఆప్షన్ క్లిక్ చేయండి.
ఆ తర్వాత బంగారు ఆభరణాలపై ఫ్రింట్ చేసిన HUD నంబర్‌ను టైప్ చేయండి.
ఆభరణాల వ్యాపారి రిజిస్ట్రేషన్ నంబర్, అస్సేయింగ్ హాల్‌మార్కింగ్ సెంటర్, AHC రిజిస్ట్రేషన్ నంబర్, AHC అడ్రస్, ఆర్టికల్ టైప్, హాల్‌మార్కింగ్ తేదీ, స్వచ్ఛతతో సహా బంగారు ఆభరణాల అన్ని HUD వివరాలను చూడొచ్చు.
బంగారు ఆభరణాలపై ఉన్న HUID (హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్) నంబర్ బంగారు ఆభరణాలపై కనిపించే 6 అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్. ఆభరణాలపై చిన్నగా కనిపిస్తుంది. సాధారణంగా BIS లోగో, స్వచ్ఛత గ్రేడ్ వంటి ఇతర హాల్‌మార్క్ సింబల్స్ దగ్గర ఉంటుంది.