×
Ad

Income Tax Online : టాక్స్ పేయర్లు పండగ చేస్కోండి.. ఇకపై UPI ద్వారా TAX కట్టేయండి.. ఇదిగో సింపుల్ ప్రాసెస్!

Income Tax Online : పన్నులు చెల్లించే ప్రక్రియను ఇప్పుడు చాలా ఈజీ. మీ ఫోన్‌లో Paytm, PhonePe, Google Pay ద్వారా కూడా ఆదాయపు పన్ను చెల్లించవచ్చు.

  • Published On : February 14, 2026 / 08:43 PM IST

Income Tax Online ( Image Credit : AI )

  • ఆదాయపు పన్ను చెల్లించడం ఇకపై చాలా ఈజీ
  • యూపీఐ ద్వారా ఇన్ కమ్ టాక్స్ పేమెంట్ చేయొచ్చు
  • మీ ఫోన్లలో పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే ఉంటే చాలు
  • యూపీఐ ద్వారా ఆదాయపు పన్ను పేమెంట్ ఎలా చేయాలి?

Income Tax Online : టాక్స్ పేయర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఆదాయపు పన్ను చెల్లించడం చాలా ఈజీ. చాలామంది పన్నుచెల్లింపుదారులు టాక్స్ పేమెంట్ సమయంలో ఆందోళన చెందుతుంటారు. ఐటీఆర్ ఫైలింగ్ విషయంలో చాలా ఒత్తిడికి లోనవుతుంటారు.

ఇకపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. మీరు ఆన్‌లైన్‌లో ఈజీగా టాక్స్ పేమెంట్ చేయొచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అవ్వడమే.. సరైన అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంచుకోవడమే..

గతంలో ఫారమ్‌లను నింపడం వంటి ఇబ్బందులు ఇక ఉండవు. గతంలో కన్నా ఇప్పుడు ఈ ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియ చాలా ఈజీ అయింది. ఆదాయపు పన్ను శాఖ యూపీఐ ద్వారా పన్ను పేమెంట్లను ప్రారంభించింది. ఇకపై మీరు Paytm, PhonePe, Google Pay వంటి యాప్‌లతో మీ ఫోన్ నుంచే నేరుగా చెల్లించవచ్చు. అధికారిక ఆదాయపు పన్ను పోర్టల్‌ని విజిట్ చేసి లాగిన్ అవ్వండి.

1: ఆదాయపు పన్ను పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి
మీ పాన్ కార్డు, పాస్‌వర్డ్‌తో ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి. ఇ-పే టాక్స్ ఆప్షన్ ఎంచుకోండి. సరైన టాక్స్ టైప్ (ముందస్తు పన్ను, స్వీయ-అంచనా, నోటిఫికేషన్ పన్ను ) మొదలైనవి ఎంచుకోండి. అసెస్‌మెంట్ సంవత్సరాన్ని కూడా జాగ్రత్తగా ఎంచుకోండి. అంటే మీరు ఏ సంవత్సరానికి పన్ను చెల్లిస్తున్నారో అవగాహన తప్పనిసరి.

Read Also : Income Tax Rule 2026 : ఇన్‌కమ్ టాక్స్ కొత్త రూల్స్.. ఇక జీతం పొందేవారికి పండగే..

2 : UPI ఎంచుకుని ఐడీని ఎంటర్ చేయండి
పేమెంట్ స్క్రీన్‌లో యూపీఐ ఆప్షన్ ఎంచుకోండి. మీ పేటీఎం, ఫోన్‌పే లేదా జీపే ఖాతాకు లింక్ చేసిన మీ యూపీఐ ఐడీని ఎంటర్ చేయండి. సాధారణంగా మొబైల్ నంబర్@upi లేదా name@bank మాదిరిగా కనిపిస్తుంది.

3 : మీ మొబైల్‌లో పేమెంట్ కన్ఫార్మ్ చేయండి
మీ UPI యాప్‌లో ఇప్పుడు రిక్వెస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. మీ పేరు, మొత్తాన్ని చెక్ చేయండి. ఆపై మీ UPI పిన్‌ను ఎంటర్ చేయండి. పేమెంట్ సెకన్లలోపు ప్రాసెస్ అవుతుంది. పేమెంట్ తర్వాత, పోర్టల్ మీ చలాన్ ఐడెంటిటీ నెంబర్, పేమెంట్ రిసీప్ట్ కనిపిస్తుంది. ఈ రసీదును డౌన్‌లోడ్ చేసి దగ్గర జాగ్రత్తగా ఉంచండి. మీ పన్ను చెల్లింపుకు ప్రూఫ్‌గా అవసరమైనప్పుడు చూపించవచ్చు.

FAQs : యూపీఐతో ఆదాయపు పన్ను చెల్లించే విధానం ఏంటి?

1. యూపీఐ ద్వారా అడ్వాన్స్ టాక్స్ చెల్లించవచ్చా?
అవును. పోర్టల్‌లో సరైన పన్ను కేటగిరీ, అంచనా సంవత్సరాన్ని ఎంచుకోండి. మీరు యూపీఐ ద్వారా అడ్వాన్స్ టాక్స్, స్వీయ-అంచనా పన్ను, పన్ను డిమాండ్లను కూడా చెల్లించవచ్చు.

2. నెట్ బ్యాంకింగ్ కన్నా భిన్నంగా ఉందా? :
పేమెంట్ మెథడ్ మాత్రమే తేడా అంతే.. నెట్ బ్యాంకింగ్‌కు యూజర్ ఐడీని గుర్తుంచుకోవడం అవసరం. దీనికి కొంచెం సమయం పడుతుంది. అయితే, యూపీఐ సెకన్లలో పేమెంట్లను ప్రాసెస్ చేస్తుంది. చాలా మందికి ఈ పద్ధతి బాగా తెలిసి ఉంటుంది.

3. పేమెంట్ డిలీట్ చేసినా రిసిప్ట్ కనిపించకపోతే ఏం చేయాలి?
పోర్టల్ ఎప్పటికప్పుడూ అప్‌డేట్ అవుతుంది. మళ్ళీ లాగిన్ అవ్వండి. మీ పేమెంట్ హిస్టరీని చెక్ చేయండి. అది ఇప్పటికీ కనిపించకపోతే, మీ బ్యాంక్ లావాదేవీ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి.