HP StarBook Air 14 : రూ.75 వేల ధరతో HP కొత్త ల్యాప్‌టాప్.. 42.5 గంటల బ్యాటరీ లైఫ్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

HP StarBook Air 14 : ల్యాప్‌టాప్ చైనాలో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులోకి వచ్చింది. OLED టచ్‌స్క్రీన్, Intel Core 5 320 ప్రాసెసర్, 16GB RAM, 60Wh బ్యాటరీ, ధర, పూర్తి ఫీచర్ల వివరాలు తెలుసుకోండి.

HP StarBook Air 14

  • 42.5 గంటల బ్యాటరీ బ్యాకప్.. కొత్త HP ల్యాప్‌టాప్ వచ్చేసింది
  • కేవలం 1.16 కిలోల బరువు.. టచ్‌స్క్రీన్‌తో HP అదిరిపోయే ల్యాప్‌టాప్
  • ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 16GB ర్యామ్, హెచ్‌పీ స్టార్‌బుక్ ఎయిర్ 14 ప్రత్యేకతలు

HP StarBook Air 14 : ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నారా? ప్రముఖ టెక్ కంపెనీ హెచ్‌పీ కొత్త ల్యాప్‌టాప్ తీసుకొచ్చింది. హెచ్‌పీ స్టార్‌బుక్ ఎయిర్ 14 పేరుతో చైనా మార్కెట్లో కొత్త ల్యాప్‌టాప్‌ను ప్రవేశపెట్టింది. స్టైలిష్ డిజైన్, తక్కువ బరువు, టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో పాటు లాంగ్ బ్యాటరీ బ్యాకప్ ఈ ల్యాప్‌టాప్‌లో ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రయాణాల్లో ల్యాప్‌టాప్‌ను వెంట తీసుకెళ్లేవారికి అద్భుతమైన ఆప్షన్..

హెచ్‌పీ స్టార్‌బుక్ ఎయిర్ 14 ధర ఎంత?
హెచ్‌పీ స్టార్‌బుక్ ఎయిర్ 14 ల్యాప్‌టాప్ చైనాలో 5,299 యువాన్ల ప్రారంభ ధరతో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులోకి వచ్చింది. భారత కరెన్సీలో వాల్యూ సుమారు రూ.75వేలు ఉంటుంది. (JD.com)లో ఈ ల్యాప్‌టాప్‌ను లిస్ట్ చేశారు.

Read Also :  Airtel vs Jio : యూట్యూబ్‌లో యాడ్స్‌కు గుడ్‌బై.. ఎయిర్‌టెల్‌, జియో యూజర్లకు బంపర్ ఆఫర్!

స్టారీ బ్లూ, యాష్ సిల్వర్, పియోనీ పింక్, కాంటలోప్ గ్రీన్ అనే 4 ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభించనుంది. అయితే, భారత్‌లో ఈ ల్యాప్‌టాప్ లాంచ్ తేదీ, ధరపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

డిస్‌ప్లే, డిజైన్ అదుర్స్ :
ఈ ల్యాప్‌టాప్‌లో 14 అంగుళాల డిస్‌ప్లే, 1920×1200 పిక్సెల్స్ రిజల్యూషన్ ఉన్నాయి. ఓఎల్ఈడీ టచ్‌స్క్రీన్ ప్యానెల్‌తో వస్తున్న ఈ డివైజ్‌లో అల్యూమినియం అల్లాయ్ బాడీని వాడారు. కేవలం 11.77 మిల్లీమీటర్ల మందం, 1.16 కిలోగ్రాముల బరువుతో ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.

అంతేకాదు, హింజ్ 180 డిగ్రీల వరకు ఓపెన్ అవుతుంది. దీంతో ల్యాప్‌టాప్‌ను టేబుల్‌పై పూర్తిగా ఫ్లాట్‌గా ఉంచి కూడా వాడొచ్చు. కళ్లపై ఒత్తిడిని తగ్గించేందుకు హెచ్‌పీ ఐ ఏజ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి.

ప్రాసెసర్, బ్యాటరీ స్పెషాలిటీ :
హెచ్‌పీ స్టార్ బుక్ ఎయిర్ 14లో ఇంటెల్ కోర్ 5 320 ప్రాసెసర్‌ను అందించారు. దీనికి 16GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజ్ ఉన్నాయి. 60Wh బ్యాటరీతో వస్తున్న ఈ ల్యాప్‌టాప్ 42.5 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే, వాస్తవ వినియోగంలో బ్యాటరీ లైఫ్ వినియోగ విధానం, సెట్టింగ్స్‌పై ఆధారపడి మారుతుంది.

కనెక్టివిటీ విషయానికి వస్తే.. USB-C ఛార్జింగ్ పోర్ట్, HDMI 2.1 అవుట్‌పుట్ ఉన్నాయి. పాలీ-ట్యూన్డ్ స్పీకర్లు, DTS:X అల్ట్రా ఆడియో సపోర్ట్‌తో ఎంటర్‌టైన్మెంట్ కూడా అందిస్తుంది. మొత్తంగా తక్కువ బరువు, ప్రీమియం డిజైన్, టచ్‌స్క్రీన్, భారీ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి హెచ్‌పీ స్టార్ బుక్ ఎయిర్ 14 అద్భుతమైన ల్యాప్‌టాప్‌గా నిలవనుంది.