Huawei MatePad Tablet : వారెవ్వా.. 10100mAh బ్యాటరీతో కొత్త హువావే టాబ్లెట్ అదుర్స్.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!
Huawei MatePad Tablet : చైనా కంపెనీ హువావే భారత మార్కెట్లో మేట్‌ప్యాడ్ 11 సిరీస్‌ను లాంచ్ చేసింది. హువావే నుంచి వచ్చిన ఈ టాబ్లెట్ సిరీస్ పవర్‌ఫుల్ 10,100mAh బ్యాటరీతో వస్తుంది. పూర్తి టాబ్లెట్ వివరాలివే..
- Sreehari A
- Published on- August 8, 2026 / 08:09 PM IST
Huawei MatePad Tablet
- హువావే సరికొత్త మేట్‌ప్యాడ్ 11 సిరీస్ లాంచ్
- భారత మార్కెట్లో ఈ టాబ్లెట్ సిరీస్ ధర ఎంతంటే?
- పవర్‌ఫుల్ 10,100mAh బ్యాటరీతో వస్తుంది
Huawei MatePad Tablet : కొత్త టాబ్లెట్ కొంటున్నారా? హువావే ఇండియా సరికొత్త రెండు టాబ్లెట్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ చైనీస్ బ్రాండ్ టాబ్లెట్లను మేట్‌ప్యాడ్ 11 సిరీస్‌లో తీసుకొచ్చింది. ఇందులో 10,100mAh వరకు పవర్‌ఫుల్ బ్యాటరీ ఉంది. ఈ టాబ్లెట్లు హువావే సొంత హార్మొనీఓఎస్ (HarmoneyOS)పై రన్ అవుతాయి.
ఇటీవల, ఈ సంస్థ స్మార్ట్ బ్యాండ్ హువావే బ్యాండ్ 11 ప్రో సిరీస్‌ను ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ బ్యాండ్‌లో ఏఐ (AI) ఫీచర్లు ఉన్నాయి. హువావే మేట్‌ప్యాడ్ 11 సిరీస్‌లో ఈ సంస్థ మేట్‌ప్యాడ్ SE 11 (MatePad SE 11) మేట్‌ప్యాడ్ 11.5 పేపర్ మ్యాట్ ఎడిషన్ (MatePad Matte Edition) అనే రెండు టాబ్లెట్లను తీసుకొచ్చింది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి..
ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో ఈ హువావే టాబ్లెట్‌లు రూ. 25,999 ప్రారంభ ధరతో లభిస్తున్నాయి. ఈ రెండు టాబ్లెట్‌లు దేశ మార్కెట్లో ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా మాత్రమే లభిస్తాయి. మేట్‌ప్యాడ్ 11.5 పేపర్ మ్యాట్ ఎడిషన్ ధర రూ. 49,999కు లభిస్తుంది. కంపెనీ సింగిల్ కీబోర్డ్ యాక్సెసరీలను కూడా అందిస్తోంది.
Read Also : Lava Bold N2 Price Cut : సూపర్ ఫోన్ భయ్యా.. లావా బోల్డ్ N2 ధర ఇంత తక్కువా.. అమెజాన్‌లో జస్ట్ రూ. 8,999కే
మేట్‌ప్యాడ్ 11.5 పేపర్ మ్యాట్ ఎడిషన్ :
ఈ హువావే టాబ్లెట్ 11.5-అంగుళాల 2.5K పేపర్ మ్యాట్ డిస్‌ప్లేతో వస్తుంది. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ టాబ్లెట్‌లో సర్క్యులర్ పోలరైజేషన్ టెక్నాలజీని వాడినట్టు కంపెనీ పేర్కొంది. ఇందులో గ్లేర్-ఫ్రీ మినిమల్ విజువల్ ఫెటీగ్ ఫీచర్ ఉన్నాయి. ఈ టాబ్లెట్ బ్యాక్ సైడ్ 13MP కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP కెమెరా ఉంది. ఈ 2 కెమెరాలు HD క్వాలిటీ వీడియోను రికార్డ్ చేస్తాయి.
మేట్‌ప్యాడ్ 11.5 పేపర్ మ్యాట్ ఎడిషన్ హార్మొనీఓఎస్ (HarmonyOS)పై రన్ అవుతుంది. ఇందులో హువావే నోట్స్ (Huawei Notes) యాప్ ఉంటుంది. యూజర్లకు చేతితో రాసిన నోట్స్ వర్క్‌ఫ్లోలను అందిస్తుంది. కంపెనీ సొంత కిరిన్ T82B (Kirin T82B) చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 8GB ర్యామ్, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ అందిస్తుంది. ఇందులో 10,100mAh బ్యాటరీ ఉంది. 40W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
హువావే మేట్‌ప్యాడ్ SE 11 :
ఈ హువావే టాబ్లెట్‌లో 400 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్, 11-అంగుళాల FHD+ LCD డిస్‌ప్లే ఉంది. కిరిన్ 710A చిప్‌సెట్‌తో వస్తుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉన్నాయి. కంపెనీ ఎమ్-పెన్ లైట్ స్టైలస్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఇందులో క్వాడ్ స్పీకర్లు ఉన్నాయి. 8MP రియర్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 22.5W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7000mAh బ్యాటరీ అందిస్తుంది.
