Hyundai Bayon : 35కుపైగా సేఫ్టీ ఫీచర్లు, లెవల్ 2 ADASతో వస్తున్న కొత్త హ్యుందాయ్ SUV.. బుకింగ్ వివరాలివే..!

Hyundai Bayon India Launch : హ్యుందాయ్ బేయాన్ అక్టోబర్ 26న భారత్‌లో లాంచ్ కానుంది. 35కుపైగా సేఫ్టీ ఫీచర్లు, 23 అడాస్ ఫీచర్లు, 115hp పెట్రోల్ ఇంజిన్, బుకింగ్ వివరాలివే..

Hyundai Bayon India Launch

  • అక్టోబర్ 26న హ్యుందాయ్ బేయాన్ ఎంట్రీ.. 35కుపైగా సేఫ్టీ ఫీచర్లు
  • కారులో 23 అడాస్ ఫీచర్లు.. హ్యుందాయ్ బేయాన్‌లో ఉన్నాయా?
  • రూ.11వేలతో బుకింగ్.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ADASతో కొత్త కారు

Hyundai Bayon India Launch : భారత SUV మార్కెట్లోకి మరో కొత్త కారు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్త SUV బేయాన్‌ను అక్టోబర్ 26న లాంచ్ చేయనుంది.

ఈ కారులో ఆకట్టుకునే సేఫ్టీ ఫీచర్లతో పాటు లెవెల్ 2 అడాస్ టెక్నాలజీని అందించనుంది. ఇప్పటికే ఈ SUVపై ఆసక్తి పెరుగుతుండగా, లాంచ్ ముందే కంపెనీ కీలక ఫీచర్ల వివరాలను వెల్లడించింది. అవేంటో ఓసారి లుక్కేయండి..

23 అడాస్ ఫీచర్లు.. డ్రైవింగ్ ఫుల్ సేఫ్టీ :
హ్యుందాయ్ బేయాన్‌లోని ప్రధాన ఆకర్షణ స్మార్ట్ సెన్స్ లెవల్ 2 ప్రో అడాస్ ప్యాకేజీ. ఇందులో మొత్తం 23 డ్రైవింగ్ అసిస్ట్ ఫీచర్లు ఉంటాయి. రోడ్డుపై ఎదురయ్యే ప్రమాదాల గురించి డ్రైవర్‌ను అలర్ట్ చేయడంతో పాటు కొన్ని పరిస్థితుల్లో ప్రమాదాలను నివారిస్తాయి.

Read Also : AP-Telangana Weather Alert : బాబోయ్.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు వర్ష గండం.. ఈ తేదీల్లో బయటకు రావొద్దు..!

ఈ SUVలో 3 రాడార్లు, 12 పార్కింగ్ సెన్సార్లు ఉంటాయి. ముందున్న వాహనాలు, పాదచారులు, సైకిల్ తొక్కేవారితో ఢీకొనే ప్రమాదాన్ని గుర్తించే ఫీచర్లు ఉన్నాయి. జంక్షన్ల వద్ద మలుపులు తిరిగేటప్పుడు, ఎదురుగా వాహనాలు వస్తున్నప్పుడు, బ్లైండ్ స్పాట్‌లో వాహనాలు ఉన్నప్పుడు కూడా అలర్ట్ అందుతాయి. అంతేకాదు.. స్టాప్ అండ్ గోతో స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, హైవే డ్రైవింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లు లాంగ్ డ్రైవ్‌లను మరింత సౌకర్యవంతంగా మార్చనున్నాయి.

అన్ని వేరియంట్లలో 35కుపైగా సేఫ్టీ ఫీచర్లు :
హ్యుందాయ్ ప్రకారం.. బేయాన్‌లోని అన్ని వేరియంట్లలో 35కుపైగా సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్ లభిస్తాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ ఇందులో ఉన్నాయి. రియర్ పార్కింగ్ సెన్సార్లు, సీట్‌బెల్ట్ రిమైండర్, బర్గ్లర్ అలారం వంటి ఫీచర్లు ఉంటాయి. 4 వీలర్లకు డిస్క్ బ్రేక్‌లు ఉంటాయా అనేది అన్ని వేరియంట్లకు సంబంధించి ఇంకా క్లారిటీ లేదు.

ఇంజిన్, గేర్‌బాక్స్ వివరాలివే :
బేయాన్‌లో 1.5-లీటర్, 4 సిలిండర్ల MPi పెట్రోల్ ఇంజిన్‌ను అందించనున్నారు. 115hp పవర్, 143.8Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, ఐవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉంటాయి.

బుకింగ్ వివరాలివే :
ఆసక్తిగల కస్టమర్లు రూ.11వేలతో ఈ SUVని బుక్ చేసుకోవచ్చు. సేఫ్టీ, టెక్నాలజీ, డ్రైవింగ్ సౌకర్యాలకు ప్రాధాన్యం ఇచ్చే వారికి బేయాన్ అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు..