Hyundai Venue : జస్ట్ రూ. 5 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి హ్యుందాయ్ వెన్యూ ఇంటికి తెచ్చుకోవచ్చు.. నెలవారీ ఈఎంఐ ఎంతంటే?

Hyundai Venue : మీరు హ్యుందాయ్ పాపులర్ SUV వెన్యూను కొనాలనుకుంటే ఈఎంఐ ఎంత? కనీస డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి? పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

Hyundai Venue

  • హ్యుందాయ్ వెన్యూ కొనేవారికి అద్భుతమైన ఆఫర్
  • హ్యుందాయ్ వెన్యూ టాప్ వేరియంట్ కనీస డౌన్ పేమెంట్?
  • నెలకు ఎంత మొత్తంలో ఈఎంఐ చెల్లించాలంటే?

Hyundai Venue : హ్యుందాయ్ లవర్స్ మీకోసమే.. కొత్త హ్యుందాయ్ వెన్యూ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ SUVని ఈజీగా ఈఎంఐలోనే కొనేసుకోవచ్చు. హ్యుందాయ్ వెన్యూ కోసం EMI ఎంత కట్టాలి? కనీస డౌన్ పేమెంట్ ఎంత చేయాలి? అనేది పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

హ్యుందాయ్ వెన్యూ ధర ఎంతంటే? :
ముందుగా, హ్యుందాయ్ వెన్యూ ధరల విషయానికి వస్తే.. హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue) ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). హ్యుందాయ్ వెన్యూ టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 15.82 లక్షలు (ఎక్స్-షోరూమ్).

మీరు ఢిల్లీలో టాప్-స్పెక్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే.. రూ. 2.13 లక్షలు (రిజిస్ట్రేషన్ ఫీజు) రూ. 72వేలు (ఇన్సూరెన్స్ ఫీజు) చెల్లించాల్సి ఉంటుంది. ఇతర అన్ని ఛార్జీలతో కలిపి హ్యుందాయ్ వెన్యూ టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 18.84 లక్షలు (ఆన్-రోడ్) అవుతుంది.

Read Also : Gold Price Forecast 2026 : గోల్డ్ మార్కెట్ సెన్సేషన్.. బంగారం ధరలు పడిపోతాయా? మళ్లీ రాకెట్ వేగంతో పెరుగుతాయా? మోర్గాన్ అంచనాలివే!

హ్యుందాయ్ వెన్యూ కనీస డౌన్ పేమెంట్ :
మీరు హ్యుందాయ్ వెన్యూ టాప్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తుంటే.. కనీసం రూ. 5 లక్షల డౌన్ పేమెంట్ చేయాలి. ఆ తర్వాత బ్యాంకు నుంచి రూ. 13.84 లక్షలు ఫైనాన్స్ చేయాల్సి ఉంటుంది.

హ్యుందాయ్ వెన్యూ నెలవారీ ఈఎంఐ ఎంతంటే? :
మీరు బ్యాంకు నుంచి 8 ఏళ్ల కాలపరిమితికి 9శాతం వడ్డీ రేటుతో రూ. 13.84 లక్షల రుణం తీసుకుంటే.. మీరు నెలకు రూ. 20,276 ఈఎంఐగా చెల్లిస్తారు. మొత్తం 8 ఏళ్ల కాలానికి నెలకు రూ. 20,276 ఈఎంఐగా చెల్లిస్తే.. బ్యాంకుకు మీరు చెల్లించే మొత్తం రూ. 19,46,485 అవుతుంది. ఇందులో కేవలం రూ. 5,62,485 వడ్డీ మాత్రమే ఉంటుంది. తత్ఫలితంగా, హ్యుందాయ్ వెన్యూ కోసం మీరు ఈఎంఐ రూపంలో రూ. 5,62,485 చెల్లించాల్సి ఉంటుంది.

హ్యుందాయ్ వెన్యూ ఇంజిన్ :
హ్యుందాయ్ వెన్యూలో ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో మాన్యువల్, ఆటోమేటిక్ DCT (డ్యూయల్-క్లచ్) ఉన్నాయి. ఈ కింది విధంగా 3 ఇంజన్ ఆప్షన్‌లను కూడా అందిస్తుంది.

  • 1.2L కాపా MPi పెట్రోల్
  • 1.0L టర్బో GDi పెట్రోల్
  • 1.5L U2 CRDi డీజిల్