India Post Franchise 2026 : జస్ట్ 8వ తరగతి పాసైతే చాలు.. పోస్టాఫీస్‌తో సొంత బిజినెస్.. నెలకు రూ.30 వేల ఆదాయం..!
India Post Franchise 2026 : 8వ తరగతి అర్హతతో పోస్టల్ సేవల బిజినెస్ మొదలుపెట్టొచ్చు. రూ.5వేలు సెక్యూరిటీ డిపాజిట్‌తో ఫ్రాంచైజ్ తీసుకుని సేవలపై కమిషన్ ద్వారా నెలకు రూ.30 వేల వరకు ఆదాయం పొందవచ్చు..
- Sreehari A
- Published on- September 14, 2026 / 07:18 PM IST
India Post Franchise 2026
- పోస్టాఫీస్‌తో కొత్త ఫ్రైంచైజ్ ఓపెన్ చేయొచ్చు
- రూ.30 వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం
- పెట్టుబడి తక్కువ.. ఆదాయం మాత్రం ఎక్కువ
India Post Franchise 2026 : పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. మీరు ఎంతదాకా చదువుకున్నారు. జస్ట్ 8వ తరగతి పాసైనా చాలు.. మీరే పోస్టాఫీసు ద్వారా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సొంతంగా బిజినెస్ చేయాలనుకునేవారికి ఇదే బెస్ట్ ఛాన్స్.. ఇండియా పోస్ట్ ఫ్రాంచైజ్ 2026 ద్వారా పోస్టల్ సేవలను అందిస్తూ ఆదాయాన్ని పొందవచ్చు. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో ప్రభుత్వ పోస్టల్ సేవల నెట్‌వర్క్‌లో భాగం కావాలనుకునేవారికి ఇంతకన్నా బెటర్ ఆప్షన్ ఉండదని చెప్పొచ్చు.
ఈ ఫ్రాంచైజ్‌లో ముఖ్యంగా ఫ్రాంచైజ్ అవుట్‌లెట్, పోస్టల్ ఏజెంట్ అనే రెండు విధానాలు ఉన్నాయి. పోస్టల్ ఏజెంట్లు ముఖ్యంగా స్టాంపులు, స్టేషనరీ విక్రయిస్తారు. ఫ్రాంచైజ్ అవుట్‌లెట్‌లో ఇండియా పోస్ట్‌తో డీల్ చేసుకుని వివిధ పోస్టల్ సేవలను కస్టమర్లకు అందించే అవకాశం ఉంటుంది.
అర్హతలేంటి? :
దరఖాస్తుదారుడికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి అంటూ లేదు. కనీస విద్యార్హత 8వ తరగతి పాసై ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. పోస్టల్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు అర్హులు కాదు. కస్టమర్లకు ఈజీగా అందుబాటులో ఉండే షాప్ లేదా కౌంటర్ స్పేస్ అవసరం.
Read Also : Post Office FD : మీకు పోస్టాఫీసులో FD ఉందా? 365 రోజుల ఖాతాపై ఎంత వడ్డీ వస్తుందో తెలుసా? ఫుల్ డిటెయిల్స్!
సొంత స్థలం లేదా రెంటల్ లొకేషన్ రెండూ ఉండవచ్చు. ఫ్రాంచైజ్ కోసం కనీసం రూ.5వేలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదనంగా కంప్యూటర్,ల్యాప్‌టాప్, ప్రింటర్, ఇంటర్నెట్, ఫర్నిచర్, సైనేజ్ వంటి మౌలిక సదుపాయాలకు ఖర్చు అవుతుంది.
ఏ సర్వీసుల ద్వారా ఆదాయం? :
రిజిస్టర్డ్ ఆర్టికల్స్, పార్సెల్స్, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్, పార్సెల్స్ బుకింగ్, మనీ ఆర్డర్లు, పోస్టల్ స్టాంపులు, ఎన్వలప్‌లు, స్టేషనరీ సేల్ వంటి సేవలను అందించవచ్చు. అర్హత ఉంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (PLI) ఏజెంట్ సేవలు కూడా అందించవచ్చు. కొన్ని బిల్లులు, పన్నులు, జరిమానాల వసూళ్ల వంటి సేవలు కూడా అందుబాటులో ఉండొచ్చు.
ఇందులో స్థిరమైన నెలవారీ జీతం ఉండదు. సేవలకు అనుగుణంగా కమిషన్, రెమ్యూనరేషన్ లభిస్తుంది. ట్రాన్సాక్షన్లు, కస్టమర్ ట్రాఫిక్, లొకేషన్ సేవల ఆధారంగా మీ ఆదాయం మారుతుంది. పెద్ద మొత్తంలో సేవలు అందిస్తే.. నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఆదాయం పొందవచ్చు.
దరఖాస్తు ఎలాగంటే? :
ఆధార్ కార్డు, పాన్, విద్యార్హత సర్టిఫికెట్లు, అడ్రస్ ప్రూఫ్, షాప్/ప్రెమిసెస్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు తప్పనిసరి. ముందుగా ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫ్రాంచైజ్ స్కీమ్ వివరాలను చెక్ చేయండి. అధికారిక అప్లికేషన్ ఫామ్ తీసుకుని మీ పూర్తి వివరాలను నింపండి. అవసరమైన డాక్యుమెంట్లను అటాచ్ చేసి సీనియర్ సూపరింటెండెంట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ఆఫీసులో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
