Union Budget 2024: బంగారం కొంటున్నారా? కేంద్ర బడ్జెట్‌లో ఇదే జరిగితే ధర భారీగా తగ్గొచ్చు..

ఇలా చేస్తే దుబాయ్, బెల్జియం వంటి వ్యాపార కేంద్రంగా భారత్ అవతరిస్తుందని చెప్పారు. ఆయా ట్రేడిండ్ హబ్‌ల కోసం మన...

మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో జెమ్, జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ( GJEPC ) బంగారం, వజ్రాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. బంగారంపై ప్రస్తుతం దిగుమతి సుంకం 15 శాతంగా ఉంది. దాన్ని 4 శాతానికి తగ్గించాలని కోరింది.

అలాగే, వజ్రాలపై 5 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 2.5 శాతానికి తగ్గించే ప్రతిపాదనను రానున్న కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశ పెట్టాలని GJEPC చైర్మన్ విపుల్ షా అన్నారు. కట్, పాలిష్ చేసిన రత్నాలపై దిగుమతి సుంకం ఎక్కువగా ఉంటే ఎగుమతులు తగ్గుతాయని పేర్కొన్నారు.

దీంతో ఆభరణాల పరిశ్రమలో ఉపాధి కల్పన తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాక, చైనా, థాయ్‌లాండ్ వంటి ఇతర పోటీ దేశాలతో పోటీపడలేమని అపెక్స్ ఇండస్ట్రీ బాడీ పేర్కొంది. డైమండ్ ఇంప్రెస్ట్ లైసెన్స్‌ను మళ్లీ ప్రవేశపెట్టాలని చెప్పింది.

‘సేఫ్ హార్బర్ రూల్’ను ప్రవేశపెట్టాలని GJEPC చైర్మన్ విపుల్ షా అన్నారు. ఇలా చేస్తే దుబాయ్, బెల్జియం వంటి వ్యాపార కేంద్రంగా భారత్ అవతరిస్తుందని చెప్పారు. ఆయా ట్రేడిండ్ హబ్‌ల కోసం మన డైమండ్ వ్యాపారులు విదేశాలకు వెళ్లే అవసరం కూడా ఉండదని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఇదే జరిగితే దేశీయంగా బంగారం, డైమండ్ల ధర భారీగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Gold and silver Price: బంగారం కొనుగోలుకు ఇదే మంచి సమయమా?

ట్రెండింగ్ వార్తలు