Railway Parcel App : పార్సల్‌ పంపడం ఇక ఈజీ.. రైల్వే యాప్‌తో మీ ఇంటి దగ్గర నుంచే.. జస్ట్ బుక్ చేస్తే చాలు!

Railway Parcel App : రైల్వే శాఖ అద్భుతమైన యాప్ సర్వీసు అందిస్తోంది. రైల్వే పార్సల్ యాప్ ద్వారా మీ వస్తువులను ఈజీగా పంపుకోవచ్చు. రైల్వే సిబ్బంది మీ ఇంటికే వచ్చి పార్సల్ తీసుకెళ్లి మరి డోర్ టు డోర్ డెలివరీ చేస్తారు.

Railway Parcel App

  • పార్సల్ పంపాలంటే యాప్ ద్వారా బుక్ చేయండి అంతే
  • రైల్వే సిబ్బంది మీ ఇంటికే వచ్చి పార్సల్ తీసుకెళ్తారు
  • మీ అడ్రస్ చెబితే చాలు వాళ్లే డోర్ టు డోర్ డెలివరీ చేస్తారు

Railway Parcel App : సామాన్యులకు పండగే.. రైల్వే శాఖ సరికొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై తక్కువ ఖర్చుతో మీ పార్సల్స్ పంపుకోవచ్చు. రైల్వే శాఖే ఈ పార్సల్స్ ఎక్కడికి పంపాలో అక్కడికి పంపుతుంది.

ఇప్పటివరకు రైల్వే స్టేషన్‌కి వెళ్లి ఫారాలు నింపి పార్సల్‌ పంపాల్సి వచ్చేది. ఇకపై అలా ఉండదు. మీ మొబైల్‌లో ‘రైల్‌ పార్సల్‌ యాప్‌’ ఉంటే చాలు.. రైల్వే పార్సల్ సిబ్బంది మీ ఇంటికే వచ్చి పార్సల్‌ తీసుకెళ్తారు.

మీరు చెప్పిన అడ్రస్‌కు డెలివరీ చేస్తారు. రైల్వే శాఖ పార్సల్ డోర్‌-టు-డోర్‌ సర్వీసును అందిస్తోంది. ప్రైవేటు కొరియర్‌, లాజిస్టిక్‌ సంస్థలతో పోలిస్తే దాదాపు 65 శాతం నుంచి 70 శాతం వరకు తక్కువ ధరలకే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే ప్యాకింగ్‌, అన్‌ప్యాకింగ్‌, స్టోరేజీ వంటి సౌకర్యాలూ కూడా అందుబాటులో ఉన్నాయి.

సామాన్యులకు బిగ్ రిలీఫ్ :
చాలావరకూ ప్రైవేట్ సంస్థలు పార్సల్ సర్వీసు కోసం ఎక్కువ మొత్తంలో డబ్బులు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నాయి. ముఖ్యంగా జాబ్ ట్రాన్స్ ఫర్స్, స్టడీ కోసం ఇతర సిటీలకు వెళ్లే వారు, హాస్టళ్లలో ఉండే వారికి ఇంటి నుంచి ఏదైనా పంపాలంటే తల్లిదండ్రులు థర్డ్ పార్టీ సర్వీసులపై ఆధారపడేవారు. పైగా ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. ఈ రైల్వే పార్సల్ యాప్ రాకతో చాలా మందికి భారీ ఉపశమనం కలగనుంది.

Read Also : March Car Discounts : కియా బంపర్ ఆఫర్.. మార్చిలో ఈ కార్లపై రూ.50,000 వరకు డిస్కౌంట్.. ఇప్పుడే కొనండి

ఉదాహరణకు.. హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌కు బుక్స్ బాక్సులు పంపాలంటే.. ప్రైవేటు సంస్థలు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నాయి. కానీ, మీరు రైల్వే పార్సల్‌ యాప్‌ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కడికైనా ఈజీగా పంపుకోవచ్చు. ఒకవేళ మీ సామాను స్టోరేజీలో ఉంచాలన్నా దీనికి కూడా సదుపాయం ఉంది.

యాప్ ఎలా వర్క్ అవుతుంది? :
ఈ యాప్‌లో స్టేషన్‌-టు-స్టేషన్‌, స్టేషన్‌-టు-డోర్‌, డోర్‌-టు-స్టేషన్‌, డోర్‌-టు-డోర్‌ వంటి 4 రకాల ఆప్షన్లు ఉన్నాయి. ఎంచుకున్న సర్వీసుకు రైల్వేతో భాగస్వామ్యం కుదుర్చుకున్న లాజిస్టిక్‌ సంస్థలు ఇంటికే వచ్చి మీ పార్సల్‌ తీసుకెళ్తాయి. అయితే, బరువు, దూరం ఆధారంగా ధర ఎంత ఉంటుంది అనేది అన్ని యాప్‌లోనే చూడొచ్చు. ఆన్‌లైన్‌ పేమెంట్లు చేసి ఈజీగా సర్వీసులను పొందవచ్చు.

తక్కువ ఖర్చుతో భారీ సౌలభ్యం :
హైదరాబాద్‌ సిటీ నుంచి వైజాగ్ వరకు 60 కిలోల బుక్స్ పార్సల్ పంపాలంటే ప్రైవేటు కంపెనీలు సుమారు రూ.5,500 వరకు ఛార్జ్ చేస్తున్నాయి. అదే రైల్వే యాప్‌ ద్వారా దాదాపు రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది.

మీరు బైక్‌ పంపాలంటే ప్రైవేటు సంస్థలు వేలాది రూపాయలు అడుగుతాయి. కానీ, రైల్వే సేవల ద్వారా దాదాపు రూ.2500తోనే మీ బైక్ పంపవచ్చు. వాస్తవానికి ఈ రైల్వే పార్సల్ సర్వీసు వ్యాపారులకు మాత్రమే పరిమితమైంది. కానీ, ఇకపై రైల్వే పార్సల్‌ సేవలు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చేశాయి.