Barrierless Toll : లాంగ్ క్యూలకు చెక్.. దేశంలోనే ఫస్ట్ టోల్ సిస్టమ్.. ఇక టోల్ ప్లాజాల వద్ద ఆగేది లేదు.. ఏ వాహనంపై ఛార్జీ ఎంతంటే?
Barrierless Toll : దేశంలో మొట్టమొదటి అవరోధ రహిత (MLFF) టోల్ వ్యవస్థను ప్రారంభించారు. ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగకుండానే వెళ్లిపోవచ్చు. లాంగ్ క్యూలు కూడా ఉండవు. సూరత్ వద్ద కొత్త టోల్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది..
- Sreehari A
- Published on- May 1, 2026 / 07:00 PM IST
Barrierless Toll
- భారతీయ మొట్టమొదటి అవరోధ రహిత టోల్ వ్యవస్థ
- సూరత్ వద్ద ముంబై-ఢిల్లీ జాతీయ రహదారి (NH48)పై ప్రారంభం
- మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టెక్నాలజీతో ఈ కొత్త సిస్టమ్ అందుబాటులోకి
- ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగకుండానే వెళ్లిపోవచ్చు.
Barrierless Toll : దేశంలో రోడ్డు ప్రయాణం మరింత ఈజీ కానుంది. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద లాంగ్ క్యూల గోల ఇక ఉండదు. 2026 చివరి నాటికి భారత్ పూర్తిగా టోల్ రహితంగా మారుతుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. అంటే.. రాబోయే రోజుల్లో టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు.
భారత మొట్టమొదటి అడ్డంకులు లేని టోల్‌ను గుజరాత్‌లోని సూరత్‌లో చౌరాసి టోల్ ప్లాజా వద్ద (Barrierless Toll) విజయవంతంగా ప్రారంభించారు. ఈ టోల్ ప్లాజాను ముంబై-ఢిల్లీ జాతీయ రహదారి (NH48)పై సూరత్ సమీపంలో ప్రారంభించారు. ఇకనుంచి వాహనాలు ఆగకుండానే వెళ్ళిపోవచ్చు.
అవరోధ రహిత టోల్ వ్యవస్థ ఏంటి? :
ఈ కొత్త వ్యవస్థ మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి అడ్డంకులు ఉండవు. మీ వాహనాన్ని ఆపాల్సిన అవసరం కూడా ఉండదు. మీ వాహనం టోల్ కింద నుంచి వెళ్తున్నప్పుడు టోల్ ఆటోమాటిక్‌గా ఈ మొత్తం ప్రాసెస్ ఆటోమేటెడ్ అవుతుంది. మానవ ప్రమేయం అవసరం ఉండదు.
ఈ కొత్త వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? :
ఈ వ్యవస్థ అత్యాధునిక కెమెరాలు, సెన్సార్లతో పనిచేస్తుంది. ఈ కెమెరాలు ANPR (ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్) టెక్నాలజీ ఉపయోగించి వాహనాల నంబర్ ప్లేట్లను రీడ్ చేస్తాయి. ఫాస్టాగ్ ద్వారా వాహన వివరాలను కూడా సేకరిస్తాయి. ఈ డేటా ఆధారంగా, టోల్ పేమెంట్ నేరుగా మీ బ్యాంక్ ఖాతా నుంచి కట్ అవుతుంది.
కార్లు, జీపులు, వ్యాన్‌లపై టోల్ ఎంత? :
కార్లు, జీపులు, వ్యాన్ వంటి చిన్న వాహనాలకు టోల్ ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ వాహనాలకు సుమారు రూ. 100 నుంచి రూ.150 వరకు ఛార్జీ విధిస్తారు. దూరం, హైవేను బట్టి ఛార్జీలు కొద్దిగా మారవచ్చు.
#WATCH | Surat,. Gujarat: India’s first barrierless, Multi-Lane Free Flow (MLFF) tolling system has been officially implemented at the Choryasi toll plaza on NH-48 near Surat.
(Visuals from Choryasi toll plaza) pic.twitter.com/jVwAEM8Icu
— ANI (@ANI) May 1, 2026
బస్సులు, ట్రక్కులకు ఎంత చెల్లించాలి? :
బస్సులు, ట్రక్కుల వంటి మిడ్ రేంజ్ భారీ వాహనాలపై అధిక టోల్ వసూలు చేస్తారు. బస్సులు సుమారు రూ. 300 నుంచి రూ. 500 వరకు వసూలు చేయవచ్చు. అయితే, భారీ ట్రక్కులు వాటి సైజు సంఖ్యను బట్టి రూ. 500 లేదా అంతకంటే ఎక్కువ వసూలు చేయవచ్చు.
మల్టీ-యాక్సిల్ భారీ వాహనాలకు నియమాలేంటి? :
పెద్ద కంటైనర్ ట్రక్కుల వంటి భారీ వాహనాలకు అత్యధిక టోల్ వసూలు చేస్తారు. వాహనం పరిమాణం బరువును బట్టి, ఇలాంటి వాహనాలకు రుసుము రూ. 600 నుంచి రూ. 1,000 వరకు లేదా అంతకన్నా ఎక్కువే ఉండవచ్చు.
ప్రజలకు ప్రయోజనాలేంటి? :
ఈ కొత్త వ్యవస్థతో అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. టోల్ ప్లాజాల వద్ద రద్దీ తగ్గుతుంది. ఆగాల్సిన అవసరం ఉండదు. ట్రాఫిక్ దానంతట అదే వేగంగా కదులుతుంది. ప్రయాణ సమయం తగ్గి, ఇంధనం ఆదా అవుతుంది.
2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా వెయ్యి కన్నా ఎక్కువ టోల్ ప్లాజాలను ఈ కొత్త వ్యవస్థకు మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా టోల్ వ్యవస్థను మరింత అప్ గ్రేడ్ చేయనుంది. తద్వారా సరుకు రవాణాలో సమయం చాలా ఆదా అవుతుంది.
