Post Office PAN : పోస్టాఫీసులో కొత్త రూల్స్.. ఇక ఈ పేమెంట్లకు పాన్ కార్డు ఇవ్వాల్సిందే.. పూర్తి నిబంధనలివే..!
Post Office PAN : పోస్టాఫీసులో మీకు సేవింగ్ అకౌంట్ ఉందా? ఇప్పటికే ఏ స్కీమ్ లోనైనా ఇన్వెస్ట్ చేశారా? కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 ప్రకారం ఇకపై పోస్టాఫీసులో అన్ని లావాదేవీలకు పాన్ కార్డు కూడా సమర్పించాలి. కొత్త నిబంధనలకు సంబంధించి ఇప్పుడు చూద్దాం..
Post Office PAN
- పోస్టాఫీసులో సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్
- ఇకపై అన్ని లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి
- కొత్త ఆదాయ పన్ను ప్రకారమే ఈ నిబంధనలు వర్తింపు
Post Office PAN : పోస్టాఫీసులో మీరు ఇన్వెస్ట్ చేశారా? మీకు సేవింగ్స్ అకౌంట్ ఉందా? మీకో బిగ్ బ్రేకింగ్ న్యూస్.. పోస్టాఫీసులో లావాదేవీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది.
కొత్త ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. పోస్టాఫీసు లావాదేవీల నిబంధనల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. క్యాష్ డిపాజిట్లు, విత్ డ్రాయల్స్, కొత్త అకౌంట్లకు పాన్ కార్డు తప్పనిసరి అయింది. పోస్టాఫీసులో కొత్తగా వర్తించే నిబంధనలకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పాన్ ఇక తప్పనిసరి :
కొత్త నిబంధనల ప్రకారం.. పోస్టాఫీసులో ఇక జరిగే అన్ని లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి. పాన్ కార్డు లేకుంటే మాత్రం ఫామ్ 97 సమర్పించక తప్పదు. ఖాతాదారు పేరు, అడ్రస్, ట్రాన్సాక్షన్ టైప్, మొత్తం పూర్తి వివరాలను సరైన ఆధారాలతో సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఫామ్లను పోస్టాఫీసులో 6 ఏళ్ల పాటు స్టోర్ చేస్తారు.
ఫామ్ 15G, 15హెచ్ స్థానంలో కొత్త ఫామ్ :
పోస్టాఫీసులో రాబడి వడ్డీ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు పొందే ఖాతాదారులకు వర్తిస్తాయి. గతంలో వాడిన ఫామ్ 15G, 15H స్థానంలో ఇప్పుడు కొత్త ఫారం అందుబాటులోకి వచ్చింది. అదే ఫామ్ 121గా ప్రవేశపెట్టారు.
అంచనా వార్షిక ఆదాయం పన్ను పరిధిలోకి రాని వారు కూడా ఈ ఫారమ్ 121 ద్వారా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. పోస్టాఫీసులో వడ్డీ ఆదాయంపై అడ్వాన్స్ టాక్స్ కోత ఉండదు. ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఈ డిక్లరేషన్ అనేది వేర్వేరుగా ఇవ్వాల్సి ఉంటుంది.
అసలు మార్పులేంటంటే? :
భారీ మొత్తంలో క్యాష్ డిపాజిట్ చేస్తుంటారు. అలాగే విత్ డ్రా లేదంటే టైమ్ డిపాజిట్లు ఓపెన్ చేస్తే ఇకపై పాన్ కార్డు వివరాలు తప్పనిసరి. గతంలో పాన్ కార్డు లేకున్నా ఫామ్ 60 వాడేవారు. ఇకపై ఫామ్ 97, ఫామ్ 98 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 30 వరకు డిక్లరేషన్ అక్టోబర్ 31వ తేదీలోపు.. మార్చి 31 వరకు అందితే ఏప్రిల్ 30లోపు రిపోర్ట్ చేయాలని పోస్టాఫీసులకు గడువు విధించారు.
పోస్టాఫీసులో ప్రతి లావాదేవీ పారదర్శకత, పన్ను ఎగవేతకు అసలు అవకాశం ఉండదు. పోస్టాఫీసుకు ఖాతాదారులు వెళ్లేముందే పాన్ కార్డు దగ్గర పెట్టుకోవాలి. ఇప్పటికీ పాత ఫామ్స్ అందుబాటులో ఉన్నాసరే కొత్త నిబంధనలను ఎలా పాటించాలో తప్పక తెలుసుకోవడం ముఖ్యం.
