World Gold Council: భారత్‌లో పసిడికి భారీగా పెరిగిన డిమాండ్.. ఎందుకంటే?

అత్యధికంగా పసిడిని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా తొలిస్థానంలో ఉండగా, భారత్‌ రెండో స్థానంలో ఉంది.

భారత్‌లో పసిడికి డిమాండ్ భారీగా పెరిగిందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ తెలిపింది. దిగుమతి సుంకంలో కోత విధించడమే డిమాండ్ ఏర్పడడానికి కారణం. ఈ ఏడాది సెప్టెంబరు నెలతో ముగిసిన త్రైమాసికంలో భారత్‌లో బంగారం గిరాకీ 18 శాతం పెరిగింది.

దీంతో 248.3 టన్నులకు చేరింది. 2023లో ఇదే సమయం ఆ మొత్తం 210.2 టన్నులుగా ఉండేది. పండుగలతో పాటు పెళ్లిళ్ల సీజన్‌ వల్ల పసిడికి డిమాండ్ మరింత పెరగవచ్చు. దీంతో 2024లో మొత్తం పసిడి గిరాకీ 700 నుంచి 750 టన్నుల మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయి.

గ్లోబల్‌ మార్కెట్‌లోనూ పసిడికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. జులై, ఆగస్టు, సెప్టెంబర్ త్రైమాసికంలో పసిడి డిమాండ్ 5 శాతం పెరిగింది. దీఆంతో 1,313 టన్నులకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో 1,249.6 టన్నులుగా ఇది ఉంది.

కాగా, కేంద్ర బడ్జెట్‌లో పసిడిపై కస్టమ్స్‌ సుంకాన్ని (15 శాతం నుంచి 6 శాతానికి) తగ్గించారు. అత్యధికంగా పసిడిని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా తొలిస్థానంలో ఉండగా, భారత్‌ రెండో స్థానంలో ఉంది.

Jio Payment Services : పేటీఎం, ఫోన్‌పేకు పోటీగా ‘జియో పే’ పేమెంట్స్ సర్వీసులు.. ఆర్బీఐ ఆమోదం..!