Samsung Galaxy Z Flip 6 : శాంసంగ్ మడతబెట్టే ఫోన్ కావాలా? ఇలా కొన్నారంటే అమెజాన్‌లో అతి తక్కువ ధరకే.. డోంట్ మిస్
Samsung Galaxy Z Flip 6 : శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ డిస్కౌంట్ ధరకే కొనేసుకోండి. గెలాక్సీ Z ఫ్లిప్ 6 ఏకంగా రూ.37,200 తగ్గింపు పొందింది.

Samsung Galaxy Z Flip 6
Samsung Galaxy Z Flip 6 : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 (Samsung Galaxy Z Flip 6) పై భారీ డిస్కౌంట్ పొందవచ్చు.
ఈ స్టైలిష్ ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్‌పై అమెజాన్ రూ.37,200 కన్నా భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. శాంసంగ్ అభిమానులు అయితే ఈ ఆకర్షణీయమైన ఆఫర్ అసలు వదులుకోవద్దు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 డీల్ :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 ప్రారంభ ధరకు రూ.1,09,999కు లాంచ్ అయింది. ఈ ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.76,500కి లిస్టు అయింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6పై రూ.33,499 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. మీరు HDFC క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.3,750 డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ట్రేడ్ చేయవచ్చు.
Read Also : Vivo T4 Pro : కొత్త వివో T4 ప్రో ఫోన్ వస్తోంది.. ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా.. ధర ఎంత ఉండొచ్చంటే?
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6లో FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X మెయిన్ డిస్‌ప్లే ఉంది. అలాగే, 60Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 3.4-అంగుళాల సూపర్ అమోల్డ్ కవర్ డిస్‌ప్లే ఉంది. ఈ ఫ్లిప్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ కలిగి ఉంది. ఇంకా, 25W ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 4000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6లో 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10MP కెమెరా ఉంది. ఈ ఫోన్ ఏఐ ఫీచర్లలో ఆటో జూమ్ ఉన్నాయి. జూమ్ అడ్జెస్ట్ కోసం బెస్ట్ ఫ్రేమింగ్ కలిగి ఉంది.