Infinix GT 30 Pro Sale : కొత్త ఫోన్ కావాలా? ఇన్ఫినిక్స్ GT 30 ప్రోపై స్పెషల్ సేల్ ఆఫర్లు.. ఈ గేమింగ్ ఫోన్ చౌకైన ధరకే కొనేసుకోండి..!

Infinix GT 30 Pro Sale : ఇన్ఫినిక్స్ GT 30ప్రో 5G ఫోన్ 8GB + 256GB వేరియంట్ ధర రూ.24,999 కాగా, 12GB + 256GB మోడల్ ధర రూ.26,999కు లభిస్తోంది. ఈ గేమింగ్ ఫోన్ తక్కువ ధరకే లభిస్తోంది.

Infinix GT 30 Pro Sale

Infinix GT 30 Pro Sale : కొత్త ఇన్ఫినిక్స్ ఫోన్ కొంటున్నారా? లేటెస్ట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ GT 30 ప్రో 5G ఫోన్ స్పెషల్ సేల్ మొదలైంది. ఈ కొత్త మోడల్ గత ఏడాది మేలో లాంచ్ అయింది. ఇన్ఫినిక్స్ GT 20 ప్రో 5Gకి అప్‌గ్రేడ్ వెర్షన్.

అద్భుతమైన ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సైడ్ కస్టమైజడ్ LED లైట్ ప్యానెల్‌లతో సైబర్ మెచా 2.0 డిజైన్, పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్టిమేట్ SoC, 45W వైర్డు, 30W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Samsung Galaxy A36 5G : కొత్త ఫోన్ కావాలా? శాంసంగ్ గెలాక్సీ A36 5Gపై బిగ్ డిస్కౌంట్.. అతి తక్కువ ధరకే ఇలా కొనేసుకోండి!

ఇన్ఫినిక్స్ GT 30 ప్రో 5G ధర, ఆఫర్లు :
భారత మార్కెట్లో ఇన్ఫినిక్స్ GT 30 ప్రో 5G ఫోన్ (8GB + 256GB) వేరియంట్‌ ధర రూ.24,999 నుంచి లభ్యమవుతుంది. 12GB + 256GB మోడల్ ధర రూ.26,999గా ఉంది. స్పెషల్ లాంచ్ డే ఆఫర్‌లో భాగంగా 8GB ర్యామ్ బేస్ మోడల్ ఫస్ట్ సేల్ రూ.22,999కే అందుబాటులో ఉంటుంది.

ఇందులో ICICI బ్యాంక్ కస్టమర్లకు రూ.2వేలు తగ్గింపు పొందవచ్చు. జూన్ 12 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో పొందవచ్చు. ఇన్ఫినిక్స్ GT 30 ప్రో 5G ఫోన్ బ్యాక్ సైడ్ వైట్ LED లైట్లు బ్లేడ్ వైట్, RGB LED యూనిట్లతో డార్క్ ఫ్లేర్ వంటి 2 కలర్ ఆప్షన్లలో వస్తుంది.

ఇన్ఫినిక్స్ GT 30ప్రో 5G స్పెసిఫికేషన్లు :
ఇన్ఫినిక్స్ GT 30 ప్రో 5G ఫోన్ అద్భుతమైన 6.78-అంగుళాల 1.5K (1,224×2,720 పిక్సెల్స్) అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 144Hz వరకు ఆకట్టుకునే రిఫ్రెష్ రేట్, 2,160Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 2,304Hz PWM డిమ్మింగ్ రేట్‌ను అందిస్తుంది.

4,500 నిట్స్ వరకు గరిష్ట ప్రకాశంతో డిస్‌ప్లే ఆల్వేస్-ఆన్ ఫీచర్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. 4nm ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమన్షిటీ 8350 అల్టిమేట్ SoC ద్వారా ఆధారితంగా 12GB వరకు LPDDR5X ర్యామ్, 256GB UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది.

ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ XOS 15 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుంది. గూగుల్ సర్కిల్ టు సెర్చ్‌తో పాటు ఏఐ నోట్, ఫోలాక్స్, రైటింగ్ అసిస్టెంట్ వంటి ఇన్ఫినిక్స్ AI సూట్ టూల్స్, ఇతర ఫీచర్లు ఉన్నాయి.

గేమర్‌ల కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్ఫినిక్స్ XBoost గేమింగ్ ఇంజిన్, థర్మల్ కూలింగ్ కోసం ఏఐ-ఆధారిత VC కూలింగ్ సిస్టమ్, స్పీడ్ 520Hz రెస్పాన్స్ రేటుతో GT షోల్డర్ ట్రిగ్గర్‌లు ఉన్నాయి. BGMIలో 120fpsకి కూడా సపోర్టు ఇస్తుంది. ప్రత్యేకమైన e-స్పోర్ట్స్ మోడ్‌ను కూడా కలిగి ఉంది.

కెమెరా విషయానికి వస్తే.. :
కెమెరాల పరంగా ఇన్ఫినిక్స్ GT 30 ప్రో 5G ఫోన్ 108MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, అద్భుతమైన సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. అదనంగా, ఈ ఫోన్ హై-రెస్ ఆడియో సపోర్ట్‌తో డ్యూయల్ స్పీకర్‌ కలిగి ఉంది. 5,500mAh బ్యాటరీ 45W వైర్డు, 30W వైర్‌లెస్ ఛార్జింగ్ కలిగి ఉంది.

Read Also : OnePlus 13s Sale : వన్‌ప్లస్ 13s ఫస్ట్ సేల్ ఆఫర్లు.. ఐఫోన్ 16 కన్నా బెటర్ ఫీచర్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి..!

రివర్స్ ఛార్జింగ్ ఆప్షన్లలో 10W వైర్డు, 5W వైర్‌లెస్‌లో అందుబాటులో ఉన్నాయి. కనెక్టివిటీ ఫీచర్లలో 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, NFC, GPS, USB టైప్-C ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే.. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. 163.7×75.8×7.99mm కొలతలు, 188 గ్రాముల బరువు ఉంటుంది.