Infinix Xpad 30 Pro : 8,200mAh బ్యాటరీతో కొత్త ఇన్ఫినిక్స్ టాబ్లెట్ వస్తోందోచ్.. కీలక ఫీచర్లు లీక్!
Infinix Xpad 30 Pro : ఇన్ఫినిక్స్ ఎక్స్‌ప్యాడ్ 30 ప్రో త్వరలో లాంచ్ కానుంది. ఈ టాబ్లెట్ లాంచ్ ముందే రిటైలర్ ద్వారా లిస్ట్ అయింది. కీలక స్పెసిఫికేషన్ల వివరాలివే..
- Sreehari A
- Published on- July 18, 2026 / 09:10 PM IST
Infinix Xpad 30 Pro
Infinix Xpad 30 Pro : ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త ప్యాడ్ వచ్చేస్తోంది. అతి త్వరలో ఇన్ఫినిక్స్ ఎక్స్‌ప్యాడ్ 30 ప్రోను లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రొడక్టు పేజీలో రివీల్ అయింది. రాబోయే ఈ ఆండ్రాయిడ్ టాబ్లెట్ రిటైలర్ లిస్టులో కూడా కనిపించింది.
ఈ ట్యాబ్ డిజైన్, కలర్ ఆప్షన్లు, కీలక స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి. ఈ లిస్టు ప్రకారం.. ఇన్ఫినిక్స్ ఎక్స్‌ప్యాడ్ 30 ప్రో మీడియాటెక్ హీలియో G200 అల్టిమేట్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 11-అంగుళాల డిస్‌ప్లే 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 8,200mAh బ్యాటరీతో రావొచ్చు. పూర్తి ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి..
ఇన్ఫినిక్స్ ఎక్స్‌ప్యాడ్ 30 ప్రో స్పెసిఫికేషన్లు :
ఈ ఇన్ఫినిక్స్ ఎక్స్‌ప్యాడ్ అధికారిక ప్రొడక్టు పేజీ ఇన్ఫినిక్స్ వెబ్‌సైట్‌లో కనిపించింది. ఈ లిస్టింగ్ ఇప్పుడు అందుబాటులో లేదు. ఈ టాబ్లెట్ ఫొటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్నాయి. అలాగే, ఇన్ఫినిక్స్ ఎక్స్‌ప్యాడ్ 30 ప్రో కొన్ని రిటైల్ సైట్లలో 8జీబీర్యామ్, 128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్‌లతో లిస్టు అయింది. ఈ టాబ్లెట్ గ్రే, పర్పుల్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.
లిస్టింగ్ ప్రకారం.. ఇన్ఫినిక్స్ ఎక్స్‌ప్యాడ్ 30 ప్రోలో 2.5K (1,600×2,560 పిక్సెల్స్) రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ 274ppi పిక్సెల్ డెన్సిటీతో 11-అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే ఉంది. ఈ టాబ్లెట్ ఇన్ఫినిక్స్ XOS 16.3 ఇంటర్‌ఫేస్‌తో ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుందని లిస్టింగ్ వెల్లడిస్తుంది. వై-ఫై-ఓన్లీ ఎల్టీఈ వేరియంట్‌లలో, కీబోర్డ్ స్టైలస్ వంటి యాక్సెసరీలకు సపోర్టు అందిస్తుంది.
Read Also : BSNL Postpaid Plan : BSNL బంపర్ ఆఫర్.. రూ.199కే 25GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్.. నెలంతా ఎంజాయ్!
ఇన్ఫినిక్స్ ఎక్స్‌ప్యాడ్ 30 ప్రో, మాలి-G57 MC2 జీపీయూతో ఆక్టా-కోర్ 6nm మీడియాటెక్ హీలియో G200 అల్టిమేట్ చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ టాబ్లెట్‌లో 256జీబీ వరకు స్టోరేజ్ ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 2టీబీ వరకు విస్తరించుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే.. ఇన్ఫినిక్స్ ఎక్స్‌ప్యాడ్ 30 ప్రోలో ఆటోఫోకస్ ఫ్లాష్‌తో 8MP రియర్ కెమెరా, అలాగే 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
లిస్టింగ్ ప్రకారం.. ఈ టాబ్లెట్‌లో డ్యూయల్ స్పీకర్లు, డ్యూయల్ మైక్రోఫోన్లు ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS, GLONASS, Galileo, BeiDou, QZSS, సింగిల్ USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. సెన్సార్లలో యాక్సిలరోమీటర్, కంపాస్, యాంబియంట్ లైట్ సెన్సార్, హాల్ సెన్సార్, గైరోస్కోప్ ఉన్నాయి. దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ52 రేటింగ్ అందిస్తుంది.
ఇన్ఫినిక్స్ ఎక్స్‌ప్యాడ్ 30 ప్రోలో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 8,200mAh బ్యాటరీ ఉంది. ఈ టాబ్లెట్ సింగిల్ ఛార్జ్‌పై 31.3 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ 250 గంటల వరకు స్టాండ్‌బై టైమ్ అందిస్తుందని లిస్టింగ్ పేర్కొంది.
