×
Ad

Post Office Scheme : పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్.. రోజుకు రూ. 333 డిపాజిట్ చాలు.. కేవలం వడ్డీనే రూ. 5 లక్షలు సంపాదించవచ్చు.. ఎలాగంటే?

Post Office RD Scheme : పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా కేవలం వడ్డీనే రూ. 5 లక్షలు సంపాదించుకోవచ్చు. మీరు ప్రతిరోజూ కేవలం రూ. 333 ఆదా చేస్తే సరిపోతుంది.

Post Office RD Scheme

  • పోస్టాఫీసులో రికరింగ్ డిపాజిట్ స్కీమ్
  • రోజుకు రూ. 333 డిపాజిట్ చేస్తే సరిపోతుంది
  • పథకం కింద 6.7 శాతంతో వడ్డీరేటు పొందొచ్చు
  • నెలకు సుమారు రూ. 10వేలు ఆదా చేస్తారు
  • నేరుగా వడ్డీ నుంచే రూ. 5 లక్షలకు పైగా సంపాదన

Post Office RD Scheme : పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారా? అయితే ఏ పథకంలో పెట్టుబడి పెడితే అద్భుతమైన బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా? పోస్టాఫీసు అందించే అన్ని పథకాల్లో ప్రయోజనాలు పొందవచ్చు. అన్ని సురక్షితమైన పెట్టుబడులే.. ప్రభుత్వ గ్యారెంటీ అందించే పథకాలు.

వీటితో అద్భుతమైన రాబడి కూడా పొందవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే జీరో రిస్క్ సేవింగ్ స్కీమ్స్.. పోస్టాఫీసు అందించే పథకాల్లో అద్భుతమైన పోస్టాఫీస్ పథకం ఒకటి ఉంది. అదే రికరింగ్ డిపాజిట్ స్కీమ్.. ఇందులో క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే మీరు కేవలం వడ్డీనే రూ. 5 లక్షలు సంపాదించుకోవచ్చు.

ఈ పోస్టాఫీస్ RD స్కీమ్ బెనిఫిట్స్ ఏంటి? :
ఇండియన్ పోస్ట్ అనేక ప్రభుత్వ పథకాలను అందిస్తోంది. అన్ని వయసుల వారికి ఈ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. మంచి రాబడిని అందించే స్కీమ్ కోసం చూస్తుంటే పోస్టాఫీస్ అందించే రికరింగ్ డిపాజిట్ పథకం అద్భుతంగా ఉంటుంది. ఇందులో వడ్డీ నంచి పెద్ద మొత్తంలో సంపాదించుకోవచ్చు. ఈ పథకం కింద 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఏ వ్యక్తి అయినా సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

పోస్టాఫీస్ ఆర్‌డీ పథకం కింద 6.7శాతంతో వడ్డీ రేటును అందిస్తోంది. ఈ పథకం కింద కేవలం రూ. 100 ప్రారంభ పెట్టుబడితో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ పథకం కింద మెచ్యూరిటీ వ్యవధి 5 ​​ఏళ్లు ఉంటుంది. మరో 5 ఏళ్లు పొడిగించే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. మీ పెట్టుబడిపై మరింత ఎక్కువ రాబడిని పొందవచ్చు. చిన్న రోజువారీ సేవింగ్స్ నుంచి భారీ మొత్తంలో కార్పస్‌ను కూడబెట్టుకోవచ్చు.

Read Also : PM Kisan Yojana : కొత్త రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ కోసం అప్లయ్ చేశారా? 22వ విడత రూ. 2వేలు పడాలంటే ఇలా చేయండి..!

కేవలం 2శాతం వడ్డీకే రుణ సౌకర్యం :
పోస్టాఫీస్ RD పథకం కింద అకౌంట్ ఓపెన్ చేసే పెట్టుబడిదారులకు మరో ప్రత్యేక బెనిఫిట్ కూడా లభిస్తుంది. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా రుణం తీసుకోవచ్చు. ఒక పెట్టుబడిదారుడు తమ పెట్టుబడిపై రుణం తీసుకోవాలంటే అకౌంట్ ఏడాది పాటు రన్ అయ్యాక తర్వాత డిపాజిట్ మొత్తంలో 50శాతం వరకు రుణం తీసుకోవచ్చు. 2శాతం వడ్డీ రేటు మాత్రమే వర్తిస్తుంది.

ఈ పథకం పెట్టుబడిని మెచ్యూరిటీ కాలానికి మించి పొడిగించకుండా వెంటనే క్లోజ్ చేసినా బెనిఫిట్స్ అందిస్తుంది. పెట్టుబడిదారులు మరో 3 ఏళ్ల తర్వాత ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఖాతాదారుడు మరణిస్తే.. నామినీ ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అవసరమైతే నామినీ కూడా ఆ పెట్టుబడిని కొనసాగించవచ్చు.

వడ్డీ ద్వారా రూ. 5 లక్షల సంపాదన ఎలా? :
ఈ పథకంలో క్రమం తప్పకుండా పెట్టుబడితో వడ్డీ ద్వారా మాత్రమే రూ. 5 లక్షలకు పైగా సంపాదించుకోవచ్చు. మీరు ప్రతిరోజూ కేవలం రూ. 333 ఆదా చేస్తే సరిపోతుంది. ఈ పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో నెలవారీగా పెట్టుబడి పెట్టాలి. వాస్తవానికి, రోజుకు రూ. 333 సేవింగ్ ద్వారా నెలకు సుమారు రూ. 10వేలు ఆదా చేస్తారు.

5 ఏళ్ల మెచ్యూరిటీ కాలంలో డిపాజిట్ మొత్తం రూ. 6 లక్షలు అవుతుంది. వడ్డీ రూ. 113,659 అవుతుంది. మొత్తం కార్పస్ రూ. 713,659 అవుతుంది. మరో 5 ఏళ్లు పొడిగిస్తే, 10 ఏళ్లలో పెట్టుబడి మొత్తం రూ. 12 లక్షలు అవుతుంది. అప్పుడు వడ్డీ రూ. 508,546 అవుతుంది. నేరుగా వడ్డీ నుంచే రూ. 5 లక్షలకు పైగా సంపాదిస్తారు. మొత్తం కార్పస్ కూడా రూ. 1708,546 అవుతుంది.

Disclaimer : ఈ పోస్టాఫీసు పథకంలో పెట్టుబడికి సంబంధించి సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. పూర్తి వివరాలను తెలుసుకునేందుకు మీ సమీపంలోని పోస్టాఫీసును లేదా ఆర్థిక సలహాదారులను సంప్రదించండి.