iPhone 14 made in india: పూర్తిగా ఇండియాలోనే తయారైన ఐఫోన్-14.. ధర కూడా తక్కువే?
ఐఫోన్-14 పూర్తిగా ఇండియాలోనే తయారైందట. ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన ఐఫోన్ మొట్టమొదటి మోడల్ ఇదే కావడం గమనార్హం. ఇంకో ప్రత్యేక విషయం ఏంటంటే.. ఈ మోడల్ ధర చాలా తక్కువ ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. పూర్తిగా భారత్లో తయారు అవుతుండడం వల్ల చాలా వరకు పన్నుల భారం తగ్గుతుందని, దీంతో మిగతా ఐపోన్ల కంటే ఐఫోన్-14 ధర తక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
- tony bekkal
- Published On : August 8, 2022 / 07:14 PM IST
iPhone 14 to be manufactured in India at the launch
iPhone 14 made in india: ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాపిల్ ఏడాదికోసారి వచ్చే ఐఫోన్ కొత్త మోడల్స్ కోసం మొబైల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా తన ఐఫోన్ న్యూ మోడల్ని యాపిల్ కంపెనీ మార్కెట్లో ప్రవేశ పెట్టనుంది. మొత్తం నాలుగు వేరియంట్లలో ఐఫోన్-14ను తీసుకువచ్చేందుకు ఆ సంస్థ సిద్ధమవుతున్నాట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనుకున్న సమయానికే వీటి లాంచింగ్ ఉంటుందనే ప్రచారం జరుగుతోందనుకోండి. అయితే ఇక్కడ వీటన్నిటికీ మించి ఓ ప్రత్యేక విషయం గురించి మాట్లాడుకోవాలి.
అదేంటంటే.. ఐఫోన్-14 పూర్తిగా ఇండియాలోనే తయారైందట. ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన ఐఫోన్ మొట్టమొదటి మోడల్ ఇదే కావడం గమనార్హం. ఇంకో ప్రత్యేక విషయం ఏంటంటే.. ఈ మోడల్ ధర చాలా తక్కువ ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. పూర్తిగా భారత్లో తయారు అవుతుండడం వల్ల చాలా వరకు పన్నుల భారం తగ్గుతుందని, దీంతో మిగతా ఐపోన్ల కంటే ఐఫోన్-14 ధర తక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
యాపిల్ చాలా కాలంగా స్థానికంగా ఐఫోన్లను తయారు చేస్తోంది. అయితే చైనాతో పాటు భారత్లో ఏకకాలంలో తయారీ చేయడం ఇదే మొదటిసారి. ఐఫోన్-14 గా పిలువబడే 6.1 అంగుళాల ఐఫోన్ మోడల్ భారతదేశంలో తయారు చేయబడిందని ప్రముఖ విశ్లేషకుడు మింగ్ చి కువో స్పష్టం చేశారు. ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడళ్లు వచ్చే నెలలో విడుదల కానున్నాయి.
