iPhone 15 Plus Price
iPhone 15 Plus Price : ఆపిల్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఐఫోన్ 15 ప్లస్ ధర భారీగా తగ్గింది. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఇదే బెటర్ (iPhone 15 Plus Price) ఆప్షన్. ఇంతకీ ఈ ఐఫోన్ 15 ప్లస్ డీల్ బ్యాంకు ఆఫర్లు, డిస్కౌంట్లతో ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
ఐఫోన్ 15 ప్లస్ ప్రాసెసర్ :
ఆపిల్ A16 బయోనిక్ ప్రాసెసర్, 3.46GHz క్లాక్ స్పీడ్, హెక్సా-కోర్ ప్రాసెసర్ కలిగి ఉంది. 6GB ర్యామ్, మల్టీ టాస్కింగ్, స్పీడ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. మెమరీ పెంచుకునేందుకు సపోర్టు లేదు. 128GB ఇంటర్నల్ స్టోరేజీ దాదాపు అన్నింటికి సరిపోతుంది.
డిస్‌ప్లే, బ్యాటరీ :
ఆపిల్ ఐఫోన్ (1290 x 2796) పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే కలిగి ఉంది. HDR, డాల్బీ విజన్, ట్రూ టోన్, డైనమిక్ ఐలాండ్ ఆప్షన్లు కలిగి ఉంది. 2,000 నిట్స్ వరకు అందిస్తుంది. సాధారణ వినియోగంలో కూడా డిఫాల్ట్ 60Hz రిఫ్రెష్ రేటు అందిస్తుంది. 4,383mAh బ్యాటరీతో పవర్, ఛార్జింగ్, 15W మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఆప్షన్లు కలిగి ఉంది.
ఐఫోన్ 15 ప్లస్ కెమెరా :
కెమెరాల విషయానికి వస్తే.. 48MP + 12MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అందిస్తుంది. 1080p, 60fps వీడియో రికార్డింగ్, సెల్ఫీల కోసం 12MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఆపిల్ ఆప్టిమైజేషన్ సాఫ్ట్‌వేర్, కెమెరా సెన్సార్ ద్వారా అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు.
Read Also : Vivo T4 Pro : కొత్త వివో ఫోన్ కావాలా? ఈ నెల 26నే వివో T4 ప్రో వచ్చేస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చంటే?
ఐఫోన్ 15 ధర :
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 అసలు ధర రూ. 79,900 నుంచి రూ.9,901 తగ్గింపు అందిస్తోంది. ఇప్పుడు ఐఫోన్ 15 ధర రూ. 69,999కు పొందవచ్చు. డెలివరీ ఆప్షన్లు, నెలకు రూ. 5,834 నుంచి సరసమైన ఈఎంఐ ప్లాన్‌లతో పొందవచ్చు.
ఆసక్తిగల కొనుగోలుదారులు వివిధ బ్యాంక్ ఆఫర్ల నుంచి ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ప్రతి త్రైమాసికంలో రూ. 4వేల వరకు 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డ్ ద్వారా రూ. 750 వరకు 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
ఇతర ఆఫర్లలో కొన్ని ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై రూ. 3వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు ఉన్నాయి. BHIM, Paytm, Mobikwik UPI లావాదేవీలపై కూడా తక్కువ క్యాష్‌బ్యాక్‌లు పొందవచ్చు.
ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, అదనపు డిస్కౌంట్లు :
పాత వెర్షన్ల ఎక్స్ఛేంజ్‌ను బట్టి రూ. 53,850 వరకు తగ్గింపు పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లలో కొన్ని మోడళ్ల ధర కన్నా రూ. 3వేలు తక్కువకు పొందవచ్చు. తద్వారా కొనుగోలుదారులు ధరపై మరింత తగ్గింపు పొందవచ్చు.
ఆపిల్ ఐఫోన్ 15 ప్లస్ పర్ఫార్మెన్స్, ఆకర్షణీయమైన డిజైన్, స్క్రీన్, లాంగ్ బ్యాటరీ లైఫ్, స్మార్ట్ కెమెరాలు, A16 బయోనిక్ చిప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్, డిస్కౌంట్లు కూడా పొందవచ్చు.